పుట:Madrasu Government Yokka Pradhana Manthiriga Undina Sriyutha Gourava Deewan Bahadur Bollini Manuswamy Nayudu Gariokka Jeevitha Charitramu.pdf/12

ఈ పుట ఆమోదించబడ్డది

ఖాయలాగాయుండి 13-1-35 రాత్రి రామస్మరణచేయుచు వుత్తరాయణ పుణ్యకాలము పుట్టినవెంటనే వైకుంఠప్రాప్తి జెందిరి. ఈయన జీవితమువల్ల రెండు అంశములు స్థిరముగా దృశ్యమగుచున్నది.

1. బుద్ధి యనునది మానవకోటికి భగవంతునివల్ల యివ్వబడిన ఒకశక్తి. బాల్యదారభ్య వృద్ధిపరచి సన్మార్గములో ప్రవర్తింపచేసినయెడల అందరన్ను వృద్ధికివచ్చి వున్నతపదవికి వచ్చుచున్నారని చెప్పుటకు సంశయములేదు.

2. జనులయందు ఐక్యమత్యము వృద్ధిపరచుటకు సర్వజనులయందు ప్రేమ అను దానిని వ్యాపింపచేయుటతప్ప పంక్తిభోజనమున్ను, ఒక తెగలోనుంచి మఱియొక తెగవారు వివాహము చేసుకోవడమున్ను, కులభేదములను వృద్ధిపరచడముకాదని స్పష్టముగా తెలియచేయుచున్నది.

ఈయన వయస్సు సుమారు 51. ఈయనయొక్క అకాలమరణము యీయన కుటుంబమునకు బంధువులకు మిత్రులకున్ను, చిత్తూరు జిల్లాలో యుండు కక్షిదార్లకున్ను దేశమునకేగాక ప్రభుత్వమువారికికూడా గొప్పవ్యసనమును కలుగచేసినది.

శ్రీయుత దివాన్ బహదూరు మునుస్వామినాయుడు గారు శాసనసభ ప్రవేశించినది మొదలు నిదివరకు చేసిన పనులను సంక్షేపముగా క్రింద వివరించియున్నాను.