ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లేకుండుట, నోటిలో తీపికల్గుట; మూత్రపురీషములు తెల్లనిరంగుతో వెడలుట, అవయవములు స్తంభించియుండుట, అప్పుడు భుజించినవానివలె నాహారములయందిచ్చపొడమక తృప్తికల్గియుండుట, (శరీరమున వేడి కొంచెముగ నుండుట, కఫముతో గూడి వాంతియగుట, శరీరమున సంధిబంధములు శిధిలములై యుండుట, భుజించిన యాహారము జీర్ణముకాకుండుట). శరీరము బరువైయుండుటా, చలిపెట్టుట, ఓకిరింతలు వచ్చుట, రోమములు జలదరించుట, నిద్ర అకాలమునందుఇను అధికముగ బట్టుట: పడిసెముపట్టుట, ఆరోచకము, దగ్గు, కన్నులు తెల్లగా నుండుట ఈ లక్షణములన్నియు కఫజ్వరమున కల్గును.

గ్రంధాంతరమున:--వెక్కిళ్ళు, శ్వాసకాపములు, ఊర్ధ్వశ్వాసము, శరీరముపై జిల, నోట నీరూరుట, చల్లని పొక్కులు లేచుట, ప్రోతస్సులు అడ్డగింపబడుట, కునికిపాటు (మైకము) హృదయమునందు జిగటుగనుండుట, వేడినిగోరుట, జఠరాగ్ని మందగించియుండుట ఇవి మున్నగు లక్షణములు పేర్కొనంబడినవి. చకారమువలన వానిని గ్రహించునది.

వాతపిత్తజ్వరలక్షణము

తృష్ణా మూర్చా భ్రమో దాహ: స్వప్ననాశ శ్శిరోరుజా,
కణ్ణాస్యశోషో నమధూ రోమహర్షోంరుచి స్తమ: 14
పర్వభేదశ్చ జృమ్బాచ వాతపిత్తజ్వరాకృతి:,

దప్పి, చక్షురాదీంద్రయవ్యాపారముల మాని యెడలెరుంగకుండుట, భ్రమము (చక్రముపై నున్న వానివలె శరీరము దిరుగునట్లుండుట, లేక మతిభ్రమచేత నొకవస్తువును మరియొకవస్తువుగ గ్రహించుట), శరీరమునమంట, నిదురరాకుండుట, తలనొప్పి, కుత్తుకయు నోరును ద్రవములేక యెండుట, వాంతియగుట, రోమములు జలదరించుట, నోట అరుచి, చీకటిలో నున్నట్లు కన్నులు గానరాకుండుట, వ్రేళ్ల మొదలగువాని కణుపులయందు పగులదీయునట్లు నొప్పికల్గుట, ఒడలివిరుపులు ఈ లక్షణములన్నియు వాతపిత్తములచే గల్గిన జ్వరంబున గానంబడును.

వాతకఫజ్వరలక్షణము

స్తైమిత్యం పర్వణాం భేద నిద్రాగౌరవమేన చ. 15
శిరోగ్రహ: ప్రతిశ్యాయ: కాసస్స్వేదాప్రవర్తనమ్,
సన్తాపో మధ్యవేగశ్చ వాతశ్లేష్మజ్వరాకృతి:. 16