ఈ పుట ఆమోదించబడ్డది

దానిని భాగింప నందు అంతభాగమున జ్వరము వ్యాపించినయెడల వాతజ్వరముప్రాప్తి యనియు, మధ్యభాగమున సంభవించినయెడ పిత్తజ్వరసంప్రాప్తి యనియు, ప్రధమ కాలమున సంభవించునెడ కఫజ్వరంప్రాప్తి యనియు నూహించునది.

మరియు "వర్షా శరద్వనంతేషు వాతాద్యై: ప్రాకృత: క్రమాత్" అనువచనప్రకారము వర్షాకాలమున వాతంబును, శరత్కాలమున పిత్తంబును, వసంతకాలమున కఫంబును ప్రబలములంగ నుండును. కావున వర్షఋతువున బుట్టిన వ్యాధి వాలిక మనియు, శరత్కాలమున బుట్టినది పైత్తిక మనియు, వసంతకాలమున బుట్టినది కఫజ మనియు, వాని సంప్రాప్తినిబట్టి యెరుంగనగును. ఇత్తెరంగున కాల భేదమునుబట్టియు సంప్రాప్తి భేదము కల్గు నని భావము.

ఇతి ప్రాక్తో విదానార్ధ: తద్వ్యానేనోపదేక్ష్యతే,

ఇత్తెరంగున నిదానపదముయొక్క అర్ధము సంగ్రహరూపముగ వివరింపబడినది. అయ్యది జ్వరాదిరోగముల ప్రకరణములయందు సవిస్తరముగ దెలుపబడును.

(ఇచ్చట సకలగోగములకును సామాన్యముగ నిదానము చెప్పబడియె. దానిని మరల నాయారోగప్రకరణములయందు ఆయారోగముల ననుసరించి విస్తరముగ దెలుపబడు నని భావము.)

నిదానవిశేషము

సర్వేషామేన రోగాణాం నిదానం కుపితా మలా:. తత్ప్రకోపస్యతు ప్రోక్తం వివిధాం హితనేవనం,

మనుజులకు సంభవించు సకలరోగములకును ప్రకోపమునొందిన వాత-పిత్త-కఫములు ప్రదానముగ కారణములై యుండును. అట్టిదోషములు ప్రకోపించుటకు పధ్యములుకాని నానావిధములైన యాహారవిహారాదుల సేవించుట కారణమగును.

ఈవిషయమును సుశ్రుతాచార్యు డిట్లు చెప్పను:- *"నాస్తి రోగో వినాదోషై: యస్తాత్తస్మాద్విచక్షణ:, అనుక్తమసి దోషాణాం బిజ్గైర్యాదిముపచరేత్" (సుశ్రుత.మా.ఆ.34) వాతాది దోషసంబంధములేక రోగ మొక్కటియైన పుట్టబోదు; కావున కొన్నిరోగములకు వాతాదిభేదములబట్టి లక్షణముల జెప్పకున్నను, ఆ రోగములకు తత్కాలమున నుండు లక్షణములబట్టి గదోషముల నిర్ణయించి ఆయాదోషములు కాంతినొందునట్లు చికిత్సజేయునవి.


  • మధుకోశమున నీశ్లోఖము చరకుడు చెప్పె నని వ్రాసెను. కాని సుశ్రుతఘునం దీశ్లోకము కానబడియెడిని.