ఈ పుట ఆమోదించబడ్డది

"జ్వరన్య పూర్వరూపే లఘ్వశనమపతర్పణం నా" (చరక. ని.అ.1) అను చరాకవచనమునే జ్వరము గల్గింప సమర్ధములగు పూర్వరూపములు గానంబడినచో యవాగుమున్నగులఘువులైన యాహారములెసేవించుట, లేక లంకణము చేయుట మచిదని తెలియుచున్నది. ఆట్టి యాహారనియమము పూర్వరూపావస్థయందు చేసినాడు. జ్వరము కల్గబోదని చరకాభిమతము. దీనిచేత జ్వరాది రోగములయందు పూర్ఫరూపావస్థ బెఱింగి యవతర్పణా(లమ్ఘనా)దుల చేయుట పూర్వ రూపమునకు బ్రయోజనమని తెలిసెడిని.

"హేతనక పూర్వరూపాణి రూపాణ్యల్పాని యస్యవై, న చ తుల్యగుణోదూష్యోన దోష:ప్రకృతిర్భవేత్." (చరక. సూ. అ.10) " నిమిత్తపూర్వరూపాణాం మధ్యమేబలే" (చరక. సూ. అ.10) "సర్వసమూర్ణలక్షణస్సన్నిపాతజ్వరోన్ సాధ్యకశి"(చరక.చి.అ.3) అనియు చరకముననున్నది. రోగకారణములగు మిధ్యాహారవిహారములును, పూర్వరూపంబులును, రోగలక్షణంబులును మిక్కిలి స్వల్పములై, దోషదూష్యములు సమానగుణములుగాక, రోగమును జనింపజేసిన దోషము శరీరప్రక్ర్త్యారంభకము గాక యున్నచో రాజ్యము సుఖసాధ్యంబనియు; నిమిత్తములు, పూర్వరూపములు, రూపములు మధ్యమబలములై యుండునది కృఛ్రసాథ్యంబగుననియు; అన్నిలక్షణములను పూర్ణముగనుంచు సన్నిపాతజ్వరము అసాధ్యం బగు ననియు పైవాక్యములచేత దెలియుచున్నది. నిమిత్తపూర్వ రూపములు బలాబలములబట్టి వ్యాధి సాధ్యాసాధ్యవ్యవస్థ నెఱుంగనగు నని రూపమునకుం గూడ ప్రయోజనము గంప ట్టుచున్నది.

"గూఢలిజ్గం వ్యాధిం ఉపశయ్యానుపశయ్యాభ్యాం పరీక్షేత" (చరక.నిమాన.అ.4) అను చరకవాక్యముచేత వ్యాధియేదోషమునజనించినదియు నేవ్యాధియైనదియు దెలియనిసందర్భమునం దుపశయముచేతను అనుపకయముచేతను నిర్ణయింపనగు నని తెలియు7చున్నది. (హేతువులకును వ్యాధులకుని ఈ రెండింటికిని విపరీతగుణంబులును విపరీతార్ధకరంబులునగు జౌషధాన్నవిహారముల నుపయోగించుట యుపశయం బనియు; అటుకాక హెత్వాదుల కనుగుణంబులగు నౌషధాదుల నుపయోగించుట అనుపశయంబనియు నురుంగునది.) దీనిచేత వ్యాధిలక్షణములు స్ఫుటముగ గానరాక నిర్ణయింపనలవిగాకుండుతని యుపశయాను పశయమునకు ప్రయోజన మని స్ఫుటమగుచున్నది.

పైచూపెట్టిన నిదానాదులనాల్గిటిచే రోగమును నిర్ణయించినను, సంప్రాప్తియందు జెప్పిన "సక్ఖ్యానికల్పప్రాధాన్యబలకాలవిశేషత:, సాభిన్యతే యధాత్రైససక్ష్య నేరస్టౌజ్వరా ఇతి" అను సంఖ్య (రోగములకు వాతాదిసంబంధమున గల్గు సంఖ్యాభేదము) నికల్పము (వారాదిదోషముల సుసూక్షాంతపరికల్పనము), ప్రాధా