ఈ పుట ఆమోదించబడ్డది

సాధనకు ప్రత్యేకంగా కృషిచేయాలి. ఆశయ సముపార్జనకు మొదటి మెట్టు ఆత్మవిశ్వాసం. ఎవడు నేను ఈ కార్యన్ని సాధించగలను అనుకొంటాడో వాడు దాన్ని సాధిస్తాడు. ఈ యాత్మవిశ్వాసంతో పాటు ఈ క్రింది అంశాలు గూడ ఆశయసాధనకు ఉపకరిస్తాయి.

మనం నిర్మించుకొన్న ఆశయాలను గూర్చి నిత్యం తలంచు కొంటూండాలి. వాటిని ఎందుకు సాధించాలో, ఎలా సాధించాలో తరచి తరచి చూస్తూండాలి. ఆశయ సాధనలో పొడసూపే అవరోధాలను గూడ ముందుగనే పసికడుతూండాలి. ఆ యాటంకాలను ఎదుర్కొనే ప్రయత్నం కూడ చేస్తుండాలి. కాని అన్నింటికంటె ముఖ్యంగా ప్రారంభించి పని చేయాలి. ఈ పనిని గూడ ఉత్సాహంతోను, దీక్షతోను, ఎడతెరపి లేకుండాను కొనసాగించుకొని పోతూండాలి. కార్యాన్ని ప్రారంభించి మధ్యలో ఆపివేసేవాణ్ణి విజయకన్య వరించదు.

ఆశయాన్ని సాధించడానికి కృషి చేయాలంటే మొదట్లో కష్టం గాను అనిష్టం గాను వుంటుంది. కాని ఓ మారు కార్యం ప్రారంభించి రోజురోజు ఓపికతో కొనసాగించుకుంటూ పోయామంటే, కొంతకాలానికల్లా ఎంతపని సాధించామబ్బా అని మనకు మనమే విస్తుపోతాం! కృష్ణా గోదావరి లాంటి మహానదులు కూడ మొదట కొన్ని నీటిబిందువులే కదా! దీర్ఘ ప్రయాణాలు కూడ మొదట కొన్ని అడుగులు వేయడమే గదా! కుంభవరాలు గూడ కొన్ని చినుకులే గదా!

5. విద్యార్థులు ఏమి ఆశయాలు పెట్టుకోవాలి?

విద్యార్థి దశలో వున్న బాలబాలికలు యువతీయువకులు ఏమి ఆశయాలు పెట్టుకోవాలి? ఆశయాలు తాత్కాలికము శాశ్వతము అని రెండు రకాలుగా వుంటాయి. తాత్కాలికాశయాలు అప్పటికప్పుడు అనగా విద్యార్థి దశలో వున్నప్పుడే సాధించవలసినవి. తాత్కాలికాశయాలు విశేషంగా విద్యార్థి బాధ్యతకూ, శీలానికీ సంబంధించినవి. ఇవి కష్టపడి చదువుకోవడం, పొదుపు, విపరీతమైన షోకులను మానడం, సోమరితనాన్ని అరికట్టడం, సకాలంలో నిద్రలేవడం, దొంగతనమూ అబద్ధాలూ మానుకోవడం, నిజాయితీ సచ్ఛీలమూ G2)