ఈ పుట ఆమోదించబడ్డది

సేకరించుకొంది. ఓ ఉపాధ్యాయునివద్ద శిక్షణ పొందింది. ఆభాష చక్కగా నేర్చుకొంది. ఈ ఉదాహరణంలో హిందీ నేర్చుకోవడమనేది ఈ యిద్దరి తాహతుకు తగిందే. కనుక మొదటి షరతు ఇద్దరి విషయంలోను నెరవేరింది. కాని రెండవ షరతు ఐన పరిధి? జానకి ప్రవేశ పరీక్ష వరకు హిందీ నేర్చుకొంటాననుకొంది. కాని వేణూకి ఈ పరిధి యేమీలేదు. అందుకే అతడు కొద్దిగా నేర్చుకొని యెంత నేర్చుకోవాలో తెలియక అంతటితో ఆగిపోయాడు. ఇక మూడవదైన కాలనియమం? జానకి 2010 ఏప్రిలును కాలనియమంగా పెట్టుకొంది. వేణూకి ఈలాంటి నియమమేమీలేదు. ఫలితంగా, జానకి హిందీ బాగా నేర్చుకుంది. వేణు నేర్చుకోలేక పోయాడు. కనుకనే ఆశయాలు పెట్టుకొనేపుడు పై మూడు నియమాలు చాల ముఖ్యమని చెప్పాం. వేణులాగ ఆశయాలు పెట్టుకొంటే వాటిని సాధించటం కష్టం. 3. ఆశయాలను సాధించినవాళ్లు

మహాపురుషులందరూ ఆశయాలు కలవాళ్లేనన్నాం. కొన్ని ఉదాహరణలు చూద్దాం. గాంధి భారతదేశ స్వాతంత్ర్యాన్ని ఆశయంగా పెట్టుకొన్నాడు. అవిరళకృషి చేసి దేశస్వాతంత్ర్యాన్ని సాధించాడు. సర్.సి.వి. రామన్ శాస్ర పరిశోధనను ఆశయంగా పెట్టుకొన్నాడు. నిద్రాహారాలు కూడ మాని ఆయన అహోరాత్రులూ పరిశోధనలు చేశాడు, నోబెలు బహుమతి కూడ పొందాడు. మదర్ తేరెసా అనాథులకు సేవ చేయడం ఆశయంగా పెట్టుకొంది. ఆమె, ఆమె సిస్టర్సూ మన దేశంలోని వివిధ పట్టణాల్లో దిక్మూమక్కూలేని ప్రజలకు లక్షలమందికి సేవలు చేస్తున్నారు. రాజారాంమోహనరాయ్ బెంగాలులో, వీరేశలింగం పంతులు గారు ఆంధ్రలో, సాంఘిక సంస్కరణం ఆశయంగా పెట్టుకొన్నారు. వీళ్లిద్దరూ ఆనాటి సమాజాన్ని బూజులు తుడిచి శుభ్రం చేశారు. 4. ఆశయాలను ఏలా సాధించాలి? ఆశయాలు కలిగించుకొన్నవాడు వాటిని కలిగించుకోని వానికంటె శ్రేషుడు. కాని ఓ ఆశయాన్ని కలిగించుకొన్నంత మాత్రానే దాన్ని సాధించినట్లుగాదు. కోరికలతోనే పనులు నెరవేరతాయా? కనుక ఆశయ GD