ఈ పుట ఆమోదించబడ్డది

ఈ వ్యాసంలో వ్యక్తి అపజయాలనుండి తన్ను తాను కాపాడుకొనే రక్షణ మార్గాలను ఆరింటిని పరిశీలించి చూచాం. అవి సాకులతో మన అసామర్థ్యాన్ని కప్పివేసుకోవడం, పుల్లని ద్రాక్షపండ్ల మనస్తత్వం ప్రదర్శించడం, పటాటోపం చూపడం, ఆడలేక మద్దెలను తిట్టడం, అపమార్గాల్లో లోప పూరణం చేసికోవడం, ఇతరుల వెలుగులో మనమూ వెలగాలి అనుకోవడం. ఈ యపమార్గాలను పిన్నలూ పెద్దలు అందరూ ఆశ్రయిస్తూనే వుంటారు. వీటిని అరుదుగా వాడుకొంటే ప్రమాదం లేదు. కాని కొంతమంది నిత్యం వీటిమీదనే ఆధారపడి జీవిస్తూంటారు. మాటిమాటికి వీటిని వాడుకొంటూంటారు. అలా చేస్తే మన వ్యక్తిత్వం వృద్ధిలోకి రాదు కదా కుంటుపడిపోతుంది. జీవితంలోని సమస్యలను యెదుర్కోవడానికి మారుగా మనలను మనం ఓదార్చుకొంటూ కూర్చుంటే లాభంలేదు. భౌతికంగా పెరిగి పెద్దవాళ్లమయ్యాక గూడ, మానసికంగా చిన్నపిల్లల్లాగే వుండిపోతాం. కనుక విద్యార్థులు యీ రక్షణ మార్గాలను జాగ్రత్తగా గుర్తించాలి. వాటిని ఆశ్రయించకుండా వుండే ప్రయత్నం చేయాలి. అనగా మొదట మన అపజయాలను మనం అంగీకరించాలి. ఆపిమ్మట వాటిని సరిదిద్దుకొనే ప్రయత్నం చేయాలి. అంతేగాని మన జీవితంలో అసలు అపజయాలే లేవు అన్నట్లుగా నటించగూడదు.

8. ఆధిక్యభావాలూ అల్లరిచేష్టలూ

నరులు జీవితంలో ఏవేవో సమస్యలను ఎదుర్కొంటూంటారు. వాటిని పరిష్కరించుకోలేక బాధపడుతుంటారు. ఐనా ప్రజలు తమ గొప్పతనాన్ని నిలబెట్టుకోవాలి గదా! తాము తక్కువవాళ్లం అనిపించుకుంటే పరువు పోతుందికదా! అంచేత వాళ్లు తమకంటె క్రిందివాళ్ల మీద అధికారం చెలాయించబోతుంటారు. తాము అధికులమనీ ఇతరులు చేతగాని వాళ్లనీ భావిసూంటారు. ఈ యూధిక్యభావంతో ఏవేవో అల్లరిచేష్టలకు పూనుకొంటూంటారు. ఈ గుణాన్నే మనస్తత్వశాస్త్రజ్ఞలు Superiority complex soo. esos Kooey Inferiority Complex వలన L