ఈ పుట ఆమోదించబడ్డది

ఇక్కడ ఈ యిద్దరు విద్యార్థులు తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ అపమార్గాలను ఎన్నుకొన్నారు. ఈలా చేస్తే లోపాలను పూరించుకోవచ్చు అనుకున్నారు. చరిత్రలో కొందరు మహాపురుషులు తాము పోగొట్టుకున్న గుణాన్ని మరో రూపంలో పొందడానికి ప్రయత్నం చేశారు. తియోడోర్ ಯಲ್ಬು పోలియో వ్యాధివలన వికలాంగుడయ్యాడు. కాని అతడు గొప్ప ప్రయత్నం వలన అమెరికా ప్రెసిడెంటు కాగలిగాడు. నెపోలియను చాల పొట్టివాడు. ఐనా అతడు గొప్ప కృషివలన సైనిక నాయకుడై దేశాలనూ ఖండాలనూ గెలిచాడు. హెలెన్ కెల్లర్ అంధురాలుగా పుట్టింది. ఐనా ఆమె కృషిచేసి గ్రంథాలు వ్రాసింది. ఇవన్నీ కూడ లోపపూరణానికి ఉదాహరణలే. కాని ఈ యుదాహరణల్లో లోపపూరణం మంచి ధోరణిలో నడిచింది. మంచి విజయాన్ని సాధించిపెట్టింది. పై జగన్నాథు రహీంముల విషయంలో లోపపూరణం మంచి ధోరణిలో నడవలేదు. వాళ్లు సాధించిన విజయం కూడ విజయం కానే కాదు. లోప పూరణం మంచిదే గాని దానిని es:ć:śJogę (ĝo à-ĝočřęćć - Substitute satisfaction.


6. శ్యాము "ఈ పట్టణంలోకల్లా మా నాన్న గొప్ప నటుడు" అంటూంటాడు. తాను మాత్రం స్టేజి యొక్కి ఎరుగడు. కిశోరు "మేము పుట్బాల్ మాచిలో బందరు కాలేజిని ఓడించి వచ్చాం" అంటూంటాడు. తాను మాత్రం ఆటలో పాల్గొనలేడు. లలిత "కూచిపూడి నృత్యం ఆంధ్రులకు గర్వకారణం" అంటూ గంభీరంగా ఉపన్యసిస్తుంది. తాను మాత్రం నృత్యం చేయలేదు.


మన పెద్దలనూ మన విద్యాసంస్థలనూ మన దేశాన్ని తప్పకుండా గౌరవించవలసిందే. కాని వాటి గౌరవమ్మీదనే ఆధారపడి జీవించకూడదు. మన శక్తికొలది మనం గూడ ఏవో గౌరవప్రదమైన కార్యాలు సాధించాలి. చందమామ తనంతట తాను వెలుగలేదు. సూర్యుని వెలుగును పొంది తాను వెలుగుతుంది. అలాగే కొంతమంది యెవరి వెలుగును పొంది మనం గూడా వెలుగుదామా అని కనిపెట్టుకొని వుంటారు. వేరేవాళ్ల గొప్పతనం కొంచెం పంచుకుని తాముగూడ గొప్పవాళ్లుగా పరిగణింపబడాలని 飣£S3 &oéxS - Shining in other's glory.