ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చింది. కొంతమంది విద్యార్థులు స్టేజి అలంకరిస్తున్నారు. భానుకి చాలా సిగ్గు. అతడు బిడియంతో జంకుతూ స్టేజికి అల్లంతదూరంలో నిలబడిచూస్తున్నాడు. విద్యార్ధులు అతన్ని చూచి "ఇలా వచ్చి మాకు సహాయం చేయవోయ్" అని పిలిచారు. భాను ఉత్సాహంగా అలంకరణలో పాల్గొన్నాడు.

తేజని క్రికెట్ మాచికి కెప్టెనుగా ఎన్నుకుంటారు అనుకున్నారు విద్యార్థులంతా. SOKJO హెడ్మాస్టరుగారెందుకోగాని బోసుని కెప్టెనుగా నియమించారు. తేజకి పట్టరాని కోపం వచ్చింది. అతడు మాచ్ లొ పాల్గొన డానికి నిరాకరించాడు. చివరకు అతడు చేరకుండానే ಮಿಲ್ಲಲುಜಟ್ಟು క్రికెట్ పోటీకి వెళ్లింది. ఇక్కడ భాను, తేజ సంఘటనల్లో భేదం ఏమిటి? భాను ఇతరులతో కలిసి పనిచేయడానికి అంగీకరించాడు. తేజు అలా అంగీకరించలేదు. మనమందరమూ యితరులతో కలిసి పనిచేయాలని కోరుకొంటుంటాం. మనం ఇతరులతో ఇతరులు మనతో సహకరిస్తూండాలి. ఎవరినైనా మనతో కలిసి పనిచేయనీయక పోయినట్టైతే అతడు తనకు అవమానం జరిగినట్లుగా భావించి బాధపడతాడు. వేరేవాళ్లతో కలిసి మెలిసి పనిచేస్తుంటే మనకు ఓ విధమైన ఆనందం కలుగుతుంది. అందుకే పిక్నికులు, మాచీలు అంత ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయి. నరుడు ఒంటరిగా కాక సాంఘికంగా జీవించాలనే ప్రకృతికూడా నిర్ణయించింది. కనుక మనం ఇతరులతో కలిసిమెలిసి తిరుగుతూండాలి. ఇతరులతో సహకరించి పనిచేస్తుండాలి. ఇలా కలిసిపోవడమూ, సహకరించడమూ ఓ పెద్ద సాంఘికావసరం - Participation and Cooperation.

4. తెరేస్, స్టెల్లా విద్యార్థినులు. తెరేస్ క్లాసులో అడుగు పెట్టగానే విద్యార్థినులంతా "హ్యాపి బర్త్ డే పాడారు. ఆ దినం ఆ యమ్మాయి పుట్టిన రోజు. ఆపాట విని తెరేస్ చాలా సంతోషించింది. సహాధ్యాయిను లందరికి స్వీట్సు పంచిపెట్టింది.

ఓ దినం హాస్టల్లో సినిమా చూపించబోతున్నారు. విద్యార్థినులంతా సినిమా చూడడానికి వచ్చి హాల్లో గుంపులుగా కూర్చుండి ఏవేవో కబుర్లు