ఈ పుట ఆమోదించబడ్డది

అనిపించేది" అని వ్రాసికొన్నాడు గోర్కీ తన ఆత్మ చరిత్రలో. కనుక మనం ఎవ్వరిని నిరాకరించగూడదు. పరిత్యజించగూడదు. విశేషంగా క్రొత్తగా వచ్చినవాళ్లనూ, సిగ్గుతో బిడియంతో జంకుతూ వుండేవాళ్లనూ అసలే నిరాకరించగూడదు. ఇతరులచేత అంగీకకరించబడడమూ, గుర్తించబడడమూ ఓ గొప్ప సాంఘికావసరం - Acceptance and Recognition.

2 మైత్రేయి, ఊర్మిళ యిద్దరూ కాలేజి విద్యార్థినులు. విద్యార్థినులంతా మైత్రేయిని హాస్టలు లీడరుగా ఎన్నుకున్నారు. ఆమె గౌరవార్థం చేతులు చరచి ఆమెను ప్రశంసించారు. మైత్రేయి చాల సంతోషించింది. నేనూ ఒకపాటి దాన్నికదా అనుకొని సగర్వంగా అందరివైపూ చూచింది.

ఊర్మిళ కాలేజి డే వేదికపై నాట్యం చేసింది. చాలమంది ఆ అమ్మాయి నాట్యాన్ని మెచ్చుకున్నారు. కాని ప్రిన్సిపాలుగారు మాత్రం ఆ బాలికకు మెప్పకోలు తెలియజేయడం మరచిపోయారు. ప్రిన్సిపాలు గారి నోటినుండి ఒక్కమెప్పుకోలు మాట కూడ వెలుపడనందున ఊర్మిళ చాల నొచ్చుకుంది. ప్రిన్సిపాలుగారిని లోలోపల తిట్టుకుంది. ఈ ఇద్దరమ్మాయిల సంఘటనల్లో వ్యత్యాసం ఏమిటి? విద్యార్థినులు మైత్రేయి పదవిని గుర్తించి ఆ యువతిని ప్రశంసించారు. ప్రిన్సిపాలు ఊర్మిళ సామర్థ్యాన్ని మెచ్చుకోలేదు. మనం ఇతరుల పదవినీ, శక్తి సామర్థ్యాలనూ గుర్తిస్తుండాలి. ప్రశంసిస్తుండాలి. మన కంటె పై పదవిలో వున్నవాళ్లను ఉచిత రీతిగా గౌరవిస్తుండాలి. ఈ గుర్తింపూ, ప్రశంసా, గౌరవమూ వ్యక్తులను ఓపాటివాళ్లను చేస్తాయి. మనమందరమూ ఓపాటివాళ్లం కావాలనే కోరుకొంటుంటాం గదా! ఇతరుల ప్రశంసలు అందుకొనినపుడు అందరమూ సంతోషిస్తాం, గర్వపడతాం. ఈ సంతోషావకాశాన్ని ఇతరులకు నిరాకరించకూడదు. మన పదవినీ, సామర్థ్యాన్ని తలంచుకొని సంతోషించడమూ ఇతరులు కూడ మన పెద్ద రికాన్ని గుర్తించాలని ఉబలాటపడడమూ ఓ ముఖ్యమైన fooãosváščo - Status and Approval.

3. భానుమూర్తి, తేజోమూర్తి హైస్కూలు విద్యార్ధులు. హాస్టలు డే