ఈ పుట ఆమోదించబడ్డది

వల్లా శాస్తాలూ, కళలూ సాధించడంవల్లా విజ్ఞానం పెరుగుతుంది. విజ్ఞానాభివృద్ధికి గ్రంథపఠనం అత్యవసరం. దురదృష్టవశాత్తు యూరపు దేశీయుల్లాగా మన ఆసియా దేశీయులు పుస్తకాలు చదవరు. సోమరితనంతో బాతాఖానాలతో కాలం వెళ్లబుచ్చుతుంటారు. ఓ సంస్కృత కవి ప్రాచీన కాలంలోనే.


"కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్ఛతి ధీమతాం వ్యసనేనచ మూర్థాణాం నిద్రయా కలహేనవా”

అని వాపోయాడు. అంటే బుద్ధిమంతులు కావ్యాలూ శాస్రాలూ నేర్చుకుంటూ ఆనందంగా కాలం వెళ్లబుచ్చుతూంటే, మూర్ఖులు వ్యసనా లతో, నిద్రతో, తగాదాలతో రోజులు సాగిస్తున్నారు అని భావం. ఈ సూక్తి నేడూ అక్షరాలా వర్తిస్తుంది


నెహ్రూ ఆత్మచరిత్రలోని ఓ సంఘటనం. అతడు ఓమారు చెరలో వుండగా జైలు అధికారి న్సీ విక్కడ ఎప్పడూ పుస్తకాలు చదువుతున్నావు. నేను పాఠశాల వదలివేశాక మళ్లా ఒక్కపుస్తకం గూడ చదువలేదు సుమా!" అన్నాట్ట. ఈలాంటి వాళ్లకి ఏం వ్యక్తిత్వం అలవడుతుంది?

3. ఆధ్యాత్మికావసరాలు

ప్రాథమికావసరాల్లో మూడవది భగవద్భక్తి దేవుడు తండ్రిలాంటి వాడు. నరుడు అతని బిడ్డలాంటివాడు. కనుక ఆ దేవునితో సంబంధము పెట్టుకొని జీవించని నరుడు పరిపూర్ణ వ్యక్తి కాలేడు. ఎవరి జీవితంలో భగవంతుడంటూ వుండడో వాళ్ల మనుగడలో ఓ తీరని వెలితి వుండిపోతుంది.

ఇక దేవునితో మనకు సంబంధం కలిగించేది ప్రార్థనం. కనుక నరుడు ప్రార్థనకు అలవాటు పడుతూండాలి. ప్రార్ధనం ద్వారా దివ్యశక్తిని పొందుతాం. ఈ శక్తి మన జీవితంలో ఓ బలమ్మందులా పనిచేస్తుంది. ప్రార్ధనంతోపాటు మతాచారమూ వుండాలి. సామాన్యంగా మనమతమంటే మనకు పట్టుదలా వుండాలి. అన్యమతాలంటే సహనమూ వుండాలి.

మత గ్రంథాలు తెలియనివాళ్లకు మతాచరణం మీద నిష్ట ఉండదు. వున రాష్ట్రంలోని మూడు ప్రధాన మతాలు హిందూ, క్రైస్తవ,