ఈ పుట ఆమోదించబడ్డది

మంచిపనీ చేయలేంకదా! కనుక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడంలో మొదటిమెట్టు శారీరకావసరాలను తీర్చుకోవడం.

2. వైజ్ఞానికావసరాలు

వ్యక్తిత్వాన్ని అలవరచుకోగోరే నరునికి విజ్ఞానమూ ఉండాలి. విజ్ఞానం ఆత్మజ్ఞానమూ ప్రపంచజ్ఞానమూ అని రెండు రకాలుగా వుంటుంది. మొదట ఆత్మజ్ఞానం ఉండాలి. అనగా మన మంచిచెడ్డలూ బలాబలాలు మనకు తెలిసి వుండాలి. రోజురోజు మనలను మనం సంపూర్ణ మానవులను చేసికొనే ప్రయత్నం చేస్తూండాలి. మన జంతు ప్రవృత్తిని అణచివేసికొని దివ్యప్రవృత్తిని పెంపునకు తెచ్చుకుంటూ వుండాలి.

రెండవది ప్రపంచజ్ఞానం. ఈ రంగంలో మొదట పేర్కొనదగింది విద్య జనుడు చక్కగా చదువుకొని శాస్తాలు నేర్చుకోవాలి. కళలు అభ్యసించాలి. ఈరోజుల్లో దేనిలోనే ఒకదానిలో "స్పెషలిస్టు" కాందే సమాజంలో పెద్ద పరపతి ఉండదు. ఈ మాత్రమే కాదు, నరుడు ఉచితానుచితాలు గ్రహించాలి. ఆలోచనాశక్తి పెంపొందించుకోవాలి. నేడు చాలమంది విద్యావంతులై కూడ ఆలోచనాపరులు కాలేకపోతున్నారు. ఇక విద్యార్జనంతోపాటు కొంత లోకజ్ఞానంకూడా వుండాలి. అనగా తోడి ప్రజల మనస్తత్వాలను అర్థం చేసుకోవాలి. ఇతరులతో మెలగడం తెలిసి ఉండాలి. సామాజికభావం అలవరచుకోవాలి. దైనందిన జీవితంలో కొన్ని సామాన్యాంశాలను స్వయంగా చూచుకోవడం తెలిసివుండాలి.

మూమూలుగా శారీరకాభివృద్దీ, విజ్ఞానాభివృద్దీ సమపాళ్లలో పెరుగు తుంటాయి. ఇవి రెండూ పూవూ, తావీ లాగ కలిసిపోవాలి. కాని కొందరిలో ప్రాయానికి తగిన జ్ఞానం ఉండదు. ఈలాంటి వాళ్లకు వ్యక్తిత్వ మంటూ అలవడదు. విద్యార్థి రాజు తాటిచెట్టంత మనిషి. కాని ప్రక్కవూరికి వెళ్లి పనిచేసికొని రాలేడు. అతని చెల్లెలు ప్రసన్న సన్నగా పిచ్చుక పిల్లలా ఉంటుంది. కాని చూచిరమ్మంటే కాల్చి వస్తుంది! ఆ యమ్మాయికి వ్యక్తిత్వం ఉంది. అతనికి లేదు.

వ్యక్తిత్వాన్ని వృద్ధిచేసికోగోరేవాళ్లు తమ విజ్ఞానాన్ని గూడ రోజురోజుకి పెంపొందించుకుంటూ పోవాలి. సర్తిస్త్కారంగల మనుషులతో మెలగడం ○