ఈ పుట ఆమోదించబడ్డది

1460 తగుదాసరికే మెడపూసలకు, అమ్మకన్న కాంపుకూ, అయ్య యిచ్చిన మునుముకూ సరి

1461 తడక లేని యింటిలోకి కుక్క దూరినట్లు

1462 తడిగుడ్డతో గొంతుక కోస్తాడు

1463 తడిసినగాని గుడిసె కట్టదు తాగిగాని మొగ్గడు

1464 తడిసిన కుక్కి బిగిసినట్లు

1465 తడిసి ముప్పందుము మోసినట్లు

1466 తణుకుకుపోయి మాచవరం వెళ్ళినట్లు

1467 తద్దినం కొని తెచ్చు కున్నట్లు

1468 తద్దినం నాటి జందెం

1469 తనకంపు తనకింపు పరులకంపు ఓకరింఫు

1470 తనకలిమి యింద్రభోగము తనలేమి లోకదారిద్రము

1471 తనకాళ్ళకు బందాలు తానే తెచ్చుకున్నట్లు

1472 తనకు అని తెవ్వెడు వుంటే ఆకటివేళ ఆరగించ వచ్చును

1473 తనకు కానిది గూడులంజ

1474 తనకు కానిరాజ్యం పండితేనేమి వదటకలిస్తే నేమి

1475 తనకు చెప్ప తడికలచాటు ఒకరికిచెప్ప ఒప్పలకుప్ప

1476 తనకు బాసిన వెంట్రుకలు యే రేవులో పోతేనేమి

1477 తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డబేరం

1478 తనకచ్చా తానుకట్టుకుని సానికొంపను తిరిగినాతప్పులేదు

1479 తీతువపిట్ట ఆకాశంలోగూడు కడతానన్నట్లు

1480 తనకొంగునవున్నరూక తనకు పుట్టినబిడ్డ పనికివస్తవి

1481 తన చెయ్యి కాలుతుందని సవతిబిడ్డచేతితో కలియబెట్టినట్లు