ఈ పుట ఆమోదించబడ్డది

1216 గోరువాస్తే వేలంత, వేలువాస్తే కాలంత కాలువాస్తే రోలంత, రోలువాస్తే యెంత

1217 గోవులను కోసి చెప్పులు దానము చేసినట్లు

1218 గోవులేనివూళ్ళో గొడ్దనేది శ్రీమహాలక్ష్మి

1219 గ్రామశాంతికి బోడితల

1220 గ్రాసములేని కొలువు

1221 ఘంటా కర్ణునికి అష్టాక్షరీ వుపదేశం చేయబోయినట్లు

1222 ఘోరకలి

1223 చంకపిల్ల జారిపడేటట్టు మాట్లాడుతాడు

1224 చంట్లో యెముకలు యేరినట్లు

1225 చందమామ రూపాయిబిళ్లవలె జారుతున్నాడు

1226 చంద్రవరివేషము వర్ష యోగము

1227 చంద్రుణ్ణీజూచి కుక్కలు మొరిగినట్లు

1228 చంద్రునకొక నూలుపోగు

1229 చక్కగా కూశోరా చాకలి నాయడాఅంటే, విన్నావటోయి యీడిగనాయడా మంగలినాయడి సరసము అన్నట్లు

1230 చక్కదనాలకు లొట్టిపిట్ట, సంగీతానికి గాడిద

1231 చక్కిలాలు తింటావా చల్దితింటావా అంటే చక్కిలాలూ తింటాను చల్ధీతింటాను అయ్యతోటి వేడి తింటాను అన్నాట్ట

1232 చక్కెర పందిట్లో తేనె వానకురిసినట్లు