ఈ పుట ఆమోదించబడ్డది

408 ఇల్లువిప్పి పందిరి వేసినట్లు.

409 ఇల్లు వడలగొట్టగా విడుపులశృంగారం, మొగుడు వెళ్ళగొట్టగా మొత్తలశృంగారం

410 ఇల్లు వెడలిపోరా నంబీఅంటే నామాన్యం ఎక్కడ అన్నాట్ట

411 ఇల్లెక్కి కొరవితిప్పినట్లు.

412 ఇల్లెల్లాకొట్టితే తట్టెడు పెంకులు లేవు.

413 ఇల్లేతీర్ధం, వాకిలేవారణాసి, కడుపే కైలాసం.

414 ఇవతలచేర, అవతలసార, నడుమరామరాజ్యం

415 ఇవ్వని మొండికి విడువనిచెండి

416 ఇషుంటారమ్మంటే యిల్లంతా చేసుకున్నట్లు.

417 ఇసుక తక్కిడి పేడతక్కిడి

418 ఇస్తేవాయనం పుచ్చుకుంటే వాయనం

419 ఇస్తేచెడేదిలేదు చస్తేవచ్చేదిలేదు.

420 ఇస్తేపెండ్లి ఇవ్వకపోతే పెటాకులు

421 ఇంట్లో పస్తు బైటదస్తు

422 ఇంట్లో ఇల్లాలే లేదంటే పెండ్లామా అని పిలిచాడాట

423 ఇది చలమో ఫలమో!

424 ఇంటిపిల్లికి పొరుగింటి పిల్లితోడు.

425 ఇంట్లోలింగాకారం, దోవలోచక్రాకారం, యిక్కడ జడలాకారం, యెక్కడా అన్నాకారంలేదు అన్నాడట.