ఈ పుట ఆమోదించబడ్డది

278 ఆపస్తంబులా, అశ్వలాయనులా అంటే, ఆపస్తంబులమూ కాము, అశ్వలాయులముకాము అప్పారావుగారి హర్కా రాలము అన్నాడట

279 ఆ బుర్రలో విత్తనాలే

280 ఆదివారము నాడందరము సోమవారమునాడు జోలి

281 ఆమంట ఈమంట బ్రాహ్మణార్ధం కడుపుమంట

282 ఆమడలు దూరమైతే అంత:కరణలు దూరముగా

283 ఆ మాట అనిపింతామా మామగారు

284 ఆమడలు దూరమైతే అంత:కరణలు దూరముగా

285 ఆముదపు విత్తులు ఆణిముత్యాలు అగునా

286 ఆముదములో ముంచిన యేకువలెనున్నాడు

287 ఆయంతప్పితే గాయమంత సుఖములేదు

288 ఆయం తెలిసి వ్యయము చేయుము

289 ఆయన ముందర పోవలెను

290 ఆయువుంటే విస్తరయినా, కుట్టును

291 ఆరగించగా లేనిది అడుగుతే వస్తుందా

292 ఆరంభ శూరత్వము

293 ఆ రాటపు కదురు ఏరాటానపెట్టినా బరబర

294 ఆర్భాటానకు ఆరుకుంపట్లు ఒక దుంపదాలి

295 ఆరుగకోసిన ముహూర్తాన్నే కందికూడా కొయ్యండి

296 ఆరు నెల్లనుంచి వాయించిన మద్దెల వోటిదా గట్టిదా అన్నట్లు

297 ఆరునెలలు స్నేహముచేసిన వారు వీరగుదురు