ఈ పుట ఆమోదించబడ్డది

115 అన్నము లేకపోతే వరిన్నం బట్టలేకపోతే పట్టుబట్ట.

116 అన్నరసముకన్న ఆదరణ రసము మేలు

117 అన్నానికి అఫశ్యకత పనికి మీ అదృష్టం పరగడుపున పని చెప్పకు పంటే లేవకు.

118 అన్నాలన్నీ సున్నాలు, అప్పాలన్నీ కప్పాలు.

119 అన్యాయపురిలో ఆలీమొగుడికి రంకు.

120 అన్న బొండాల నీళ్ళు నీవే తాగరా అయ్యల్లా.

121 అన్ని యిచ్చినవాడు అక్కడుండగ ఒకటిచ్చినవాడు పెచ్చు అడిగెనట

122 అన్నియు తెలిసింవాడు లేదు. యేమియు తెలియని వాడు లేదు

123 అన్నియునున్న ఆకు అణగి యుండును. ఏమియు లేని ఆకు ఎగిరిపడును.

124 అన్నియునున్నవి అయిదవతనము లేదు.

125 అన్నిరుచులూ సరేగాని, అందులో ఉప్పులేదు.

126 అపకారికైనా ఉపకారమే చెయ్యవలెను.

128 అప్పటి మాటలకు దుప్పటి యిచ్చినారు గాని, కలకాలము కప్పుకొనిచ్చినానా.

129 అప్ప వంక బావ చుట్టం, ఆళ్లవంక తిరగలి చుట్టము.