పుట:Lokokthimukthava021013mbp.pdf/180

ఈ పుట ఆమోదించబడ్డది

3033 వట్టి గొడ్దుకు అరపులు మెండు వరపు టేటికి మరపులు మెండు

3034 వట్టి తిచెయ్యి మూర వేస్తే యేమి ఫలము

3035 వట్టి నిందలు చెప్పితే గట్టి నిందలు వచ్చును

3036 వట్తిమాటల వల్ల పొట్టలు నిండుతవా

3037 వడ్డించే వాడు తనవాడైతే కడవంక్తిని కూర్చునా వొక్కటే

3038 వడ్దిఆశ మొదలు చెరచును. గుడ్దిది ఆవైతే కుండలు చెరచును

3039 వడ్లగాదెలో పందికొక్కును పెట్టినట్లు

3040 వడ్లతోకూడా దాగగ యెండ వలసింది

3041 వడ్ల రాశి వదరబోయినా వానతొసేగిలేదు

3042 వడ్లు గొడ్లు వున్నవానిదే వ్యవసాయం

3043 వడ్లగింజలో బియ్యపుగింజ

3044 వడ్లు ముత్తుం పిచ్చికలాద్దుం

3045 వడ్లు వాగునపోతేనేమి గడ్ది గాలికి పోతేనేమి

3046 వనవాసం చేయాలేరు వంగివంగి తిరగాలేరు

3047 వన్నెకాని గంజి యీగలపాలు

3048 వన్నె చీర కట్తుకున్న సంభ్రమమేకాని వెర్రికుక్క కరచిందెరుగదు

3049 వయసుతప్పినా వయ్యారం తప్పలెదు

3050 వరవుకు మెరపులు వట్టిగొడ్డు కార్పులు మెండు

3051 వరహాకన్న వడ్డిముద్దు కుమారునికన్న మనుమడుముద్దు

3052 వరికివాక దొరకుమూక అవుసరం