పుట:Lokokthimukthava021013mbp.pdf/178

ఈ పుట ఆమోదించబడ్డది

2997 లోభికి రెంటనష్టి

2998 లోకమంతా సంపాదించి ప్రాణం పోగొట్టు కుంటే యేమి లాభం

2999 లోభిని చంపవలె నంటే దబ్బు అడిగితే సరి

3000 లోభిసొమ్ము గొంగలపాలు

3001 లోని ముయ్యగలరు గాని లోకం ముయ్యగలరా

3002 లోపాలులేనిపాలన వంకరలేని కుక్కతోక ఆదర్శ మంత్రాలు

3003 లోనవికారము బైట శృంగారము

3004 లబ్డుడికి పనినిండా, లుబ్డుడికి ఖర్చునిండా

3005 వంకర టింకర కాయలు యేమెటంటే చిన్ననాడమ్మిన చింతకాయలు

3006 వంకలేనమ్మ డొంకపట్టుకు వేళ్ళాడినదట

3007 వంకాయ రుచి తోటవాడెరుగును, అరటికాయ రుచి రాజెరుగును

3008 వంగతోటలో వానికి కనిగుడ్ది, ఆకుతోటలోవానికి విని చెవుడు

3009 వంగసములో పుట్తినది పొంగలి పెట్టితే పొతుందా

3010 వంటంతా అయిందిగాని వడ్లు వొక పొలుపు యెండవలసింది

3011 వంటింటి కుందేటిని చంపినట్లు