పుట:Lokokthimukthava021013mbp.pdf/157

ఈ పుట ఆమోదించబడ్డది

2636 మనుము చెడి ముండ బుద్దిమంతురాలైనది

2637 మనుష్యులు పోయినా మాటలు నిలచును

2638 మన్నుపట్టితే బంగారం, బంగారంపట్టితే మన్ను

2639 మన్నుమగ్గితే మాలినికైనా పైరగును

2640 మన్నువెళ్ళకుండా దున్నితే వెన్ను వళ్ళకుండా పండును

2641 మనోవ్యాధికి మందులేదు

2642 మర్చిపోయి చచ్చినా ప్రాణమా రమ్మంటే వచ్చునా

2643 మన్మధుడే పురుషిడైనా మాయలాడి తన మకుబుద్ది మానదు

2644 మరిచిపొయి మారుబొట్టుతో మజ్జిగబొట్టు వేసింది

2645 మర్యాద రామన్న మాన తప్పినా వ్రేటుతప్పదు

2646 మలపసన్యాసికి మాసకమ్మకూ జత

2647 మళయాళములో చెవులు కుట్టుతారని మాలూవరం నుంచి చెవులు మూసుకొని పోయినట్లు

2648 మలుగులు క్రుంగితే మాపటికి యీనుతుంది

2649 మసిపూసి మారేదుకాయ చేసినట్లు

2650 మసిముఖంవాడు చమురు కాళ్లవాడు పోగయినట్లు

2651 మహా మహావాళ్ళు మదుళ్ళక్రింద వుంటే గోడచాటువారికి శరణము

2652 మహాలక్ష్మి పరదేశం పోయినట్లు