పుట:Lokokthimukthava021013mbp.pdf/156

ఈ పుట ఆమోదించబడ్డది

2615 మతిమీద మన్నుపోతు నిప్పుకుపోయి వుప్పు తెత్తు

2616 మతిలేనిమాట శృతిలేని పాట

2617 మతులెన్ని చెప్పినా మంకుబుద్ది మానదు

2618 మగులెన్ని చెప్పినా మామపక్కవీడదు

2119 మదుంవారి మడియైనా కావలె మాటకారి మగడైనా కావలె

2620 మదురుమీద పిల్లి

2621 మధుకరం నానింటికి ఉపదానం వాడు పోయింట్లు

2622 మనబంగారం మంచిదైన కంసాలి యేమెచేయును

2623 మనమడు నేర్చుకున్నట్లు అవ్వకు దురదతీరినట్లు

2624 మనమెరుగని చెవులకు మద్దికాయలా

2625 మనసు మహామేరువ దాటుచున్నది కాలుగడప దాటలేదు

2626 మనసులెని మనుము

2627 మనస్సుకు మనస్సే సాక్షి

2628 మనసెరుగని కల ఒడలెరుగని శివం గలదా

2629 మనస్సెరుగని అబద్దమున్నదా

2630 మనిషి కాటుకు మందులేదు

2631 మనిషికి రాక మ్రానుకువస్తుందా

2632 మనిషికి వున్న పుష్టి పనిరానికి తిన్నపుష్టి

2633 మనిషి పేదైనా మాటపేదకాదు

2634 మనిషిపోచికోలు కాదు

2635 మనువును నమ్మి బొంత బోర్ల తీసుకున్నట్లు