పుట:Lokokthimukthava021013mbp.pdf/140

ఈ పుట ఆమోదించబడ్డది

2338 పెట్టు చుట్టము పొగుడు భాగ్యము

2339 పెట్టు పోతలు శాశ్వతములా

2340 పెద్ద బావగారు ఆడంగులతొ సమము

2341 పెద్దల మాటలు పెరుగన్నముతో సమానము

2342 పెదిమకు మించిన వళ్లు, ప్రమిదకు మించిన వత్తి

2343 పెదిమ దాటితే పెన్నదాటుతుంది

2344 పెద్దకొడుకు పెంద్లి అసుర భోజనము

2345 పెద్ద తలలేకపోతే గొర్రెతల తెచ్చుకోమన్నారు

2346 పేద్దపులి తరుముకు వచ్చినా హజారం ముందుకుపోరాదు

2347 పెద్దపులి యెదుటైనా పడవచ్చునుగాని నగిరివారి యెదుట పడరాదు

2348 పెద్దయింటి బొట్టె అయినా కావలె పెద్ద చెరవు నీరు అయినా కావలె

2349 పెద్దలకు పెట్టరా పేచీలతలపాగ

2350 పెద్దలతొవదు పితరులతో పోరు

2351 పెద్దలవుసురు పెనుబామై కరచును

2352 పెన్నదాటితే పెరుమాళ్లసేవ

2353 పెన్నరావడం వెన్నకరిగేలొపల

2354 పెన్నలోమాన్యం చెప్పెనట్లు

2355 పెరగగా పెరగగా పెదబావగారు పండుకోతయినట్లు

2356 పెరటిచెట్టు మందుకురాదు

2357 పెరుగుట విరుగుటకొరకే

2358 పెరుగుపెత్తనం చెరసును