ఈ పుట ఆమోదించబడ్డది

11. అండలేనివూళ్ళో ఉండదోషము, ఆశలేని పుట్టింట అడుగ దోషము.

12.అంతకు నోచి పుట్టినావురా! అవుసల తొర్రివాడా!

13.అంతమాత్రమా కొడకా చెవులు పట్టుకొనితడ వేవ అన్నట్టు

14. అంతమాత్రం వుంటే దొంతులతో కాపురచెయ్యనా

15.అంత్యనిష్ఠురముకన్న ఆదినిష్ఠురమే మేలు

16.అందని పూవులు దేవునకు అర్పణము

17 అందని మానిపండ్లకు ఆశపడ్డట్టు

18.అందని మ్రానిపండ్ల కర్రులు జాచుట

19.అందము చిందినట్టు నాగరకము నష్టమైనట్టు

20.అందములో పుట్టిన గంధపుచెక్క ఆముదముతో పట్టినట్లు

21.అందరికి నేను లోకువ నాకు నంబిరామాయ లోకువ

22.అందరికి శకునము చెప్పేబల్లి కుదితి తొట్టిలో పడినదట

23.అందరూ అందలమెక్కితే మొసేవారు యెవరు?

24.అందరూ వకయెత్తు అగస్త్యుడు ఒక యెత్తు, ఆతని కమండలము ఒక యెత్తు.

25.అందరూ శ్రీవైష్ణవులే బుట్టెడు రొయ్యలు ఎగిరిపోతున్నై

26.అందానికు పెట్టినసొమ్ము ఆపదము అడ్డంవస్తుంది.

27.అందానికి రెండుబొందలు ఆటకు రెండుతాళాలు

28.అందినజుట్టు అందుకున్న కాళ్ళు