పుట:Lokokthimukthava021013mbp.pdf/131

ఈ పుట ఆమోదించబడ్డది

2165 పాడిఆవును దానంచేసి పాలు తానే పిరుక్కున్నట్లు

2166 పాడిపసరము, పసిబిడ్డ ఒక్కటే

2167 పాడువూరికి నక్క తలారి

2168 పాడూరికి మచముకొయ్య పోతరాజు

2169 పాడు వూళ్లో పొగిడేవారు లేరు నాకు నేనే పొగుడుకుంటాను

2170 పాత దొంగ వొక్కరోజు పట్టుబడక మానడు

2171 పాతముండ కలవరిస్తే కొత్తముండకు దెయ్యం పట్టినట్లు

2172 పాతముండ లందరు పోగయి కొత్తముండ తాడు తెంచినట్లు

2173 పానకములోని పుడక

2174 పాన్పు మంచిదిచూచి పసరము కొట్టవలెను

2175 పాపంవుంటే భయం, పల్లంవుంటేనీళ్లు

2176 పాపటకాయ కొరకనెంత యాక నెంత

2177 పాపనము పదిసేద్య్హాల పెట్టు

2178పాపమని పాతబట్టయిస్తే గోడచాటుకుపోయి మూరవేసిగొనెనట

2179 పాపమని పల్లెడంబలిపోస్తే కారంలేదని కచ్చేరికెక్కెనట

2180 పాపిసొమ్ము పరులపాలు ద్రోహిసొమ్ము దొరలపాలు

2181 పాముకాళ్ళు పామువకెరుక

2182 పాముకు పాలుపోస్తే విషమైనట్లు

2183 పాముకు బదనిక చూపినట్లు

2184 పాము చిన్నదైనా దొకటే పద్దదైనా వొకటే