పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/90

ఈ పుట ఆమోదించబడ్డది

90

దెల్పు పదమునకు కలుగదు. గజముపడె - ఇది పడియె అను క్రియాపదమునకు గజము కర్త. దాని ము వర్ణమునకు లోపమురాదు. పూర్ణ బిందువును కలుగదు. గజంపడియె - అశ్వంపడియె - అనునవి అసాధు రూపములు.

17. డు వర్ణ లోప సంధి :

సమానాధికరణంబగు, ఉత్తరపదంబు, పరంబగు నపుడు, మూడుశబ్దము, డు వర్ణమునకు లోపమును, మీది హల్లునకు, ద్విత్వమును విభాషనగు.

మూడు + జగములు = ముజ్జగములు

మూడు + లోకములు = ముల్లోకములు

విశేషణ విశేష్యములకు ఒక పదమే ఆశ్రయమగుట సమానాది కరణము. అట్టి సమాసములో ఉత్తర పదము పరమగునపుడు పూర్వపదముగా మూడు శబ్దమున్న యెడల దానిలోని డు - లోపించి మీది హల్లునకు ద్విత్వము వచ్చును.

మూ + జ్జగములు.

ద్విరుక్తంబగు హల్లు పరంబగునపుడు, ఆచ్చికంబు మీది, దీర్ఘంబునకు హ్రస్వంబగు, అను సూత్రము ననుసరించి, 'మూ' లోని దీర్ఘము లోపించి 'ము' అగును - అప్పుడు

ముజ్జగములు - ముల్లోకములు

అను రూపములు ఏర్పడును.

18. పోడ్వాదేశసంధి :

బహువ్రీహిని స్త్రీ వాచ్యంబగుచో, ను సమానంబు మీది, మేనునకు బోడియగు.

సులభ వ్యాకరణము