పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/88

ఈ పుట ఆమోదించబడ్డది

88

క్రొత్త శబ్దము ప్రాతాదుల లోనిది. క్రొత్తలో మొదటి అక్షరమునకు పరుషము పరముకాగా, నుగాగమ మగును. కొన్ని చోట్ల మీది హల్లున మీ ద్విత్వమగును. క్రొత్తలో - క్రొ మిగిలును - చాయ - పరము కాగా నుగాగమమువచ్చి క్రొ + ను + చాయ అగును. తర్వాత సరళాదేశము వచ్చి నిండు సున్న వచ్చి - క్రొంజాయ అయినది.

అట్లే క్రొంజెమట - క్రొంబసిడి గ్రహించునది.

క్రొత్తలో క్రొ మిగిలి కారులో - కా పరుషము - సరళము కాగా నుగాగమము రాక బహుళ గ్రహణముచే హల్లునకు ద్విత్వము వచ్చును.

      క్రొ + కారు - క్రొ + క్ + కారు = క్రొక్కారు
      క్రొ + నన - క్రొ + న్ + నన = క్రొన్నన
      క్రొ + తావి - క్రొ + త్ + తావి = క్రొత్తావి.

iv. అన్వంబులకు సహితమీ, కార్యంబు కొండొకచో కానంబడెయెడి.

      పది + తొమ్మిది = పందొమ్మిది
      తొమ్మిది + పది = తొంబది
      వంక + చెఱకు = వంజెఱకు
      సగము + కోరు = సంగోరు
      నిందు + వెర = నివ్వెర
      నెఱ + తఱి = నెత్తఱి

పది + తొమ్మిది - ప మిగిలి, తొమ్మిది పరముకాగా, నుగాగమమై - సరళాదేశము వచ్చి - ప + న్ + తొమ్మిది = పందొమ్మిది అయినది. ఇందు నిండు సున్న చేరినది.

సులభ వ్యాకరణము