73
iii. మధ్యమ పురుష క్రియలందిత్తునకు సంధి యగు.
నీవు - మీరు అను మధ్యమ పురుష క్రియలందలి హ్రస్వమగు ఇ కారమునకు సంధి తప్పక జరుగును.
ఉదా : - ఏలితివి + అపుడు = ఏలితివపుడు
ఏలితి + ఇపుడు = ఏలితిపుడు
ఏలితిరి + ఇపుడు = ఏలితిరిపుడు.
iv. క్త్వార్దంబైన 'యిత్తు' నకు సంధి లేదు. క్త్వార్దమనగా భూతకాలమును తెల్పు, అసమాపక క్రియ. అట్టి క్రియ లందలి హ్రస్వ ఇ కారమునకు సంధి లేదు.
ఉదా : - వచ్చి + ఇచ్చిరి = వచ్చియిచ్చిరి.
ఇత్వసంధి కొన్నిచోట్ల వైకల్పికముగను, కొన్నిచోట్ల నిత్యముగను, మరికొన్నిచోట్ల నిషేధముగను జరుగును.
3. ఉకారసంధి :
ఉత్తునకు అచ్చుపరమగు నపుడు సంధి నిత్యము. హ్రస్వమగు ఉ కారమునకు అచ్చుపరమగునపుడు సంధి జరుగును.
ఉదా : - రాముడు + అతడు = రాముడతడు.
సోముడు + ఇతడు = సోముడితడు.
అతడు + ఉండెను = అతడుండెను.
వాడు + ఎవడు = వాడెవడు.
ఉ కారసంధి కొన్నిచోట్ల వైకల్పికము. ప్రధమేతర విభక్తి శత్రర్దక చు వర్ణము నందున్న ఉ కారమునకు సంధి వైకల్పికము. ప్రధమేతర విభక్తులనగా ద్వితీయ
సులభ వ్యాకరణము