72
సంధి జరుగకుండుట -
స్త్రీ వాచక - తత్సమపద - సంబోధ నాంతంబులకు సంధి రాదు.
అమ్మ + ఇచ్చెను = అమ్మయిచ్చెను
దూత + ఇతడు = దూతయితడు
రాముడు + ఇదిగో = రాముడయిదిగో
అన్యవిధముగవచ్చుట
వెల + ఆలు = వెలయాలు.
2. ఇకారసంధి :
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగ నగును. ఏమి - ఏది - ఏవి - అవి - ఇవి - కిన్ అనునవి ఏమ్యాదులు. ఇత్తు హ్రస్వ ఇకారము.
ఏమ్యాదుల హ్రస్వ ఇకారమునకు సంధి వైకల్పికముగా జరుగును.
ఉదా :- ఏమి + అంటివి = ఏమంటివి
ఏమియంటివి
మఱి + ఏమి = మఱేమి
మఱియేమి
హరికిన్ + ఇచ్చె = హరికిచ్చె
హరికినిచ్చె.
ii. క్రియాపదములందిత్తునకు సంధి వైకల్పికముగా నగును.
ఉదా :- వచ్చిరి + అప్పుడు = వచ్చిరప్పుడు; వచ్చిరి యప్పుడు.
వచ్చితిమి + ఇప్పుడు = వచ్చితిమిప్పుడు; వచ్చితిమి యిప్పుడు.
సులభ వ్యాకరణము