పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/60

ఈ పుట ఆమోదించబడ్డది

60

కల్గుచుండును. ఆంధ్ర భాష అజంతము కాన అచ్ సంధియే జరుగుచుండును. సంధి జరిగినపుడు ఒక వర్ణలోపము కల్గినచో వర్ణ లోపమందురు.

ప్రాత + ఇల్లు = ప్రాయిల్లు

యడాగమము రాగా - ప్రాయిల్లు అగును. ఇందు 'త' లోపించినది - యడాగమము వచ్చినది.

వర్ణమింకొకటి వచ్చి చేరుట వర్ణాగమము. సంధి లేని చోట వర్ణాగమము జరుగును. మా + ఇల్లు

మా + య్ + ఇల్లు - మాయిల్లు. ఒక వర్ణమునకు బదులు మరియొక వర్ణము వచ్చిచేరుట వర్ణాదేశము. కృష్ణుడు + పోయెను - కృష్ణుడు వోయెను.

పకార స్థానమున వకారము వచ్చినది. ఇది ఆదేశము.

సంధులను స్థూలముగా సంస్కృత సంధులు, తెలుగు సంధులు అని విభజింప వచ్చును. అక్షరముల మార్పును బట్టి కూడా సంధుల వర్గీకరించవచ్చును.

1. ఆగమ సంధులు

పూర్వపర పదములలోని ఏ వర్ణమును తొలగింప కుండా, మరి యొక వర్ణము మిత్రుని వలె వచ్చి చేరిన దానిని ఆగమసంధి అందురు.

ఉదా : నీ + కలము = నీదు కలము
            నా + మాట = నాదుమాట
            తన + ఫలము = తనదు ఫలము.
            నీ + దు + కలము
            నా + దు + మాట
            తన + దు + ఫలము

సులభ వ్యాకరణము