ఈ పుట ఆమోదించబడ్డది
52
1. భావార్థకము - చదువబడుట | ఇవి విశేష్యములు |
2. వ్యతిరేక భావార్థకము - చదువబడమి | |
3. క్త్వార్ధకము - చదువబడి | ఇవి లాక్షణిక అవ్యయములు. వీనిని అసమాపక క్రియలని కూడా అందురు. |
4. వ్యతిరేక క్త్వార్ధకము - చదువబడక | |
5. చేత్రర్థకము - చదువబడుచున్ | |
6. తుమర్థకము - చదువబడన్ - వదువబడగాన్ - చదువబడంగాన్ - చదువబడగన్ - చదువబడంగన్ | |
7. అనంతర్యార్థకము - చదువబడుడున్ | |
8. చేదరర్థకము = చదువబడ్డన్ - చదువబడినన్ | |
9. వర్తమానార్థక విశేషణము - చదువబడుచున్న | ఇవి క్రియాజన్య విశేషణములు |
10. భూతర్థక విశేషణము - చదువబడిన - చదువబడ్డ | |
11. భవిష్యదర్థక విశేషణము - చదువబడు - చదువబడియెడు - చదువబడెడు - చదువబడియెడి - చదువబడెడి | |
12. వ్యతిరేకార్ధక విశేషణము - చదువబడని |
వాక్యపరిచ్ఛేదము
1. అభిప్రాయము పూర్తిగా తెల్పు పద సముదాయము వాక్యము.
శ్రీరాముడు సీతను వివాహమాడెను.
2. ఆకాంక్షా యోగ్యతాసన్నిధులభిప్రాయ బోధకములు.
ఆకాంక్ష : అనగా, పదముల పరస్పర సంబంధము.
శ్రీరాముడు సీతను - అనినంతనే ఏమిచేసెనను ప్రశ్నఉత్పన్నమగును. వివాహమాడెనని ఉత్తరము - ఇది ఆకాంక్ష.సులభ వ్యాకరణము