40
5. క్రియలు
పనులను దెలుపు పదములను ధాతువు లందురు. ధాతువులు సాధారణముగా ఉకారాంతములైయుండును.
సకర్మకములు - అకర్మకములు అని ధాతువులు రెండు రకములు.
కర్మలనపేక్షించునవి సకర్మకములు. కర్మల అపేక్షింపనివి అకర్మకములు.
సకర్మకధాతువులు : - ఇచ్చు - ఎరుగు - కప్పు - కొట్టు - కోయు - గ్రుచ్చు - చేయు - తలచు - తిను - తీయు - తెరచు - నోచు - పఠించు - పలుకు - పెట్టు - పోలు - భుజించు - మ్రింగు - వండు - వ్రాయు మొదలైనవి.
అకర్మకధాతువులు : - అగు - అణగు - అలుగు - ఉండు - ఉదయించు - ఎదుగు - కాగు - కురియు - కూలు - చను - చీలు - చెడు - తిరుగు - నడుచు - నవ్వు - నిద్రించు - పడు - పెరుగు - మునుగు - మొలచు - వచ్చు మొదలగునవి.
డు-రు, వు-రు, ను-ము, అను క్రియా విభక్తులతో కూడిన ధాతువులను క్రియలందురు.
భాషను బట్టి తత్సమక్రియలు - దేశ్యక్రియలు అని రెండు రకములు.
సంస్కృత పదములకు - ఇంచు చేర్పగా నేర్పడునవి
సులభ వ్యాకరణము