పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/143

ఈ పుట ఆమోదించబడ్డది

143


(23) వికస్వరాలంకారము :

విశేషమును సామాన్యముచే సమర్ధించుచు దానిని సమర్ధింప విశేషమును గూర్చుట.

హిమాలయము రత్ననిలయము, దానికి హిమము కళంకము నీయదు. ఒక దోషము చంద్రమండలములో కళంకమట్లు గుణములలో లీనమగును.

హిమాలయము విశేషము. ఒక దోషము సామాన్యము. చంద్రమండలమున కళంకమట్లు అనునది తత్సమర్ధక విశేషము.

(24) సారాలంకారము :

ఉత్తరోత్తర ఉత్కర్ష వర్ణనము సారాలంకారము.

తేనె తీపి - తేనెకన్న అమృతముతీపి - అంత కన్న హరినామము తీపి.

(25) సమాసోక్తి :

ప్రస్తుత విశేషణ సామ్యముచే అప్రస్తుతము తోచుట సమాసోక్తి.

సూర్యుడు నిస్తేజుడై అస్తగిరి గుహ, నణగు చున్నాడు.

ప్రస్తుతము కధకు సంబంధించినది. అప్రస్తుతము కధకు సంబంధింపనిది. ఇట రాజవృత్తాంతము అప్రస్తుతము తోచుచున్నది.

సూర్యుడు అనురక్తుడై పశ్చిమాశాముఖమును చుంబించుచున్నాడు.

సులభ వ్యాకరణము