ఈ పుట ఆమోదించబడ్డది
112
4) ఒకటి - రెండుపాదములు కలిసి మొత్తము ఎనిమిది గణములలోను బేసి స్థానమున జగణముండరాదు. రెండు నాలుగు పాదములలో మూడవ గణము తప్పక జగణముగాని, నలముగాని అయి యుండవలెను.
5) రెండు - నాలుగు పాదములలో మొదటి అక్షరమునకు, నాలుగవ గణము మొదటి అక్షరము యతి స్థానము. 1 - 3 పాదములలో యతిమైత్రి యుండదు.
6) రెండు - నాలుగు పాదములకు, చివర గురువుగల గణము మాత్రమే, యుండవలెను. అనగా భ - జ - నలములు పనికిరావు. నగణము - గగములలో నేదైన ఉండవలెను.
ఉదా :
గగ | నల | భ | ||
UU | !!!! | U !! | ||
శ్రీరా | ముని దయ | చేతను | ||
గగ | నల | నల | గగ | సగ |
UU | !!!! | !!!! | UU | !!U |
నారూ | ఢిగసక | ల జ ను లు | నౌ రా | యనగా! |
రా - రూ - ప్రాసాక్షరములు.
ఆ - ఔ - యతి స్థానాక్షరములు.
2. ద్విపద - లక్షణము :
'ఇంద్రగణములు మూడు, ఇన గణంబొకటి
చంద్రాస్య! ద్విపదకు జనురెంటవిరతి'
ఇందు రెండు పాదములు మాత్రముండును.
సులభ వ్యాకరణము