109
ఉదాహరణములు -
కాలము మంచిదై విరివిగా తెగ పండిన ఓఇరుపంటలే
చాలవు పొట్టకూటికయిటి స్వర్గమునందు వసించువారికిన్
ఇందు 'ల'కారప్రాసము. లఘువు.
ఏడీ మీ ప్రభువేడి? దేవగిరియందే గద్దెలై దీర్చియు
న్నాడా! యాలము పెండ్లి తొందరల నున్నాడా! మముం జూడగా!
ఇందు 'డ' కారము ప్రాస - గురువు.
చిందఱ రేగి, శత్రువుల చివ్వనెదిర్చుచు, వీర బృందముల్
గ్రిందులు జేసి, యాంధ్రమున, గేవలమేలితి నింతదాక, పేరంది,
- ఇందు బిందుపూర్వక ద కారము.
ఆశ్వయుజంబు వచ్చి, శరదంబుదముల్ వెల వెల్లబారె, భూ
మీశ్వర! దండయాత్రలకు నియ్యది మేలగువేళ గాని, దీ ల్లీశ్వర!
ఇందు సంయుక్తాక్షరమైన 'శ్వ' ప్రాసాక్షరము.
మొన్నటి కావ్యగాధ తల పోతకు వచ్చెడి - మా గురూత్తముల్,
పన్నిన, గబ్బమంచు, గొనివచ్చిరి, యిర్వురు, దాని తీరుమే
మెన్నక -
ఇందు ద్విత్వాక్షరమైన 'న్న'కారము ప్రాసగా వచ్చినది.
ఇదే విధముగా ప్రాసాక్షరమునకు హల్ మైత్రి యుండవలెను గాని అచ్చు మైత్రితో పనిలేదు.
యతులు : పద్యపాదము యొక్క మొదటి అక్షరముతో నాపద్యమునకు నిర్ణయింపబడిన స్థానమందలి, యక్షరము, మైత్రికలిపి యుండుట యతిమైత్రి యనబడును.
సులభ వ్యాకరణము