ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

55


గను శివధర్మమున్ గుణము గైకొని యాశ్రుతిమార్గవర్తనం
బొనరఁగఁ దాల్పునట్టి పురుషోత్తముతోఁ దనకూఁతుఁ గూర్పఁగన్.

54


రాఘవ.

నొనకొని = ఆరంభించి, జనకుండు = జనకమహారాజు, తనకూఁతున్ = జానకిని, వివాహము సేయఁగోరి, మున్ను = పూర్వము, ఒగిన్ = క్రమమున, అనేకతరంబులనుండి = తరతరములనుండి, తమయింట = తమగృహమున, పూజ్యతంగను = పూజింపఁబడుచున్న, శివధర్మము = శివధనుస్సును, గుణము గైకొని = నారిని గ్రహించి, ఆశ్రుతిమార్గవర్తనం బొనరఁగఁ దాల్చునట్టి = ఆకర్ణాంతము దిగదీసిన, పురుషోత్తముతోన్ = పురుశశ్రేష్ఠునితో (విష్ణ్వంశగలవానితో), తనకూఁతున్, కూర్పఁగన్, పూనె = ప్రతిజ్ఞ చేసెను.


తా.

జనకుఁడు తనయింటనున్న శివునివి ల్లెవ్వ రెక్కుపెట్టెదరో వారికి నాజానకి నిచ్చెదనని ప్రతిజ్ఞ చేసెను.


లక్ష్మణ.

పెండ్లికూతుఁన్ = కన్యను, జనకుండు = తండ్రి, వివాహము సేయఁగోరి, తమయింటన్, మున్నొగిన్, ఆనేకతరంబులనుండి = బహుతరంబులనుండి, పూజ్యతంగను = ఆవరించబడుచు వచ్చిన, శివధర్మమున్ = శుభాచారమును, గైకొని = స్వీకరించి, ఆ = ప్రసిద్ధమైన, శ్రుతిమార్గవర్తనంబు = వేదమార్గప్రవర్తనమును, ఒనరఁగ దాల్చునట్టి = విడువకుండఁ బూనునట్టి, పురుషోత్తముతోన్ = మంచిపురుషునితో, తనకూఁతున్, కూర్పఁగ = పెండ్లిచేయవలయునని, పూనెన్ = యత్నించెను.


తా.

తనయింట ననుగతమై వచ్చుచున్న యాచారప్రకారము వేదోక్తాచారవర్తకుఁ డైన యొక్కచక్కనిపురుషునకుఁ దనబిడ్డ నీయవలయునని పెండ్లికూఁతుతండ్రి యత్నము చేసెను.


వ.

అట్లు పూని యున్నంత.

55


క.

ధరణివరు లెందఱేనియు
నరుదుగఁ దత్కన్యఁ బెండ్లియాడుటకై వ