ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

లంకావిజయము


తా నహల్యను జాతదయ శుద్ధినొంది యా
        త్మవరసౌఖ్యంబు నొందఁగ నొనర్చి
సకలజను లెచ్చ సంప్రీతితోడుత
        నుగ్రధర్మ మడంచి యొప్పుమీఱి


గీ.

నంత నాతండ్రి తనపెద్దయాత్మజునకు
సొంపుతో నేలబొట్టె నిచ్చుట నిజ మిఁకఁ
బెండ్లి కేతెం డటంచును బిల్వవచ్చి
నట్టివారల మన్నించి యాదరించె.

51


రాఘవ.

స్థిరపరభాద్రి - స్థిర = స్థిరమైన, పర = శ్రేష్టమైన, భా = కాంతిచేతను, అద్రి = సూర్యుఁ డైన, “రవిరద్రిరవిర్హేళిః" అని యమరశేషము. కౌశికుఁడు = విశ్వామిత్రుఁడు, అయ్యజనరక్షకై = ఆయజ్ఞమును రక్షించుటకై, నియోగింపన్ = నియమింపఁగా, తదగ్రసూతి = ఆదశరథుని పెద్దకొడుకైనరాముఁడు, సుందరమణిన్ - సుంద = సుందుఁడను రాక్షసుని, రమణిన్ = భార్యయైనతాటకను, సుబాహు = సుబాహుఁడరు రాక్షసుని, తక్కుఁగలవారి = మిగిలిన రాక్షసులను, నిజవిద్యన్ = తనవిలువిద్యచేతను, తగుశిక్ష నెరయఁజేసి = తగినశిక్ష యొనర్చి (చంపి), తాన్ = తాను, అహల్యను = అహల్యాదేవిని, జాతదయన్ = పుట్టినదయతో, శుద్ధినొంది = పవిత్రురాలై, ఆత్మవరసౌఖ్యంబు నొందఁగన్ = తనపెనిమిటితోడిసుఖములను పొందునట్లు, ఒనర్చి = చేసి, సకలజనుల్, మెచ్చ, సంప్రీతితోడుత, ఉగ్రధర్మము = శివధనుస్సును, అడంచి = విఱిచి, ఒప్పుమీఱన్, అంత = అంతట, ఆతండ్రి = దశరథుఁడు, తనపెద్దయాత్మజునకున్ = తనపెద్దకొడుకునకు (రామునకు), నేలబొట్టె నిచ్చుట = భూపుత్రికయైన సీత నిచ్చుట, ఇఁక నిజము, పెండ్లికి, ఏతెండు = రండు, అటంచును = అని చెప్పుచు, పిల్వవచ్చినట్టివారలను = పిల్వవచ్చినవారలను, మన్నించి = గౌరవించి, ఆదరించె.