ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

లంకావిజయము


మదిఁ దలఁచి సర్వసమ్మతి
గదురఁగ శుభవేళ నట్లు గావించెఁ దగన్.

46


టీ.

తదనంతరంబ = పిమ్మట, సుతులకున్ = కొడుకులకు, విదితముగాఁగన్ = ఎల్లవారికిఁ దెలియునట్లు, ఉపనయనవిధి గావింపన్ = వడుగులు చేయుటకు, మదిఁ దలఁచి = ఎంచి, సర్వసమ్మతిన్ = అందఱియిష్టమును గొని, శుభవేళన్ = శుభలగ్నమున, అట్లు గావించెన్ = తాను దలఁచిన ట్లుపనయనములు జేసెను.
రాఘవార్థమున, లక్ష్మణార్థమున రెంటికి నర్థము తాత్పర్యము సమానము.


చ.

అంత.

47


గీ.

రాముఁడును లక్ష్మణుండు గారాముమీఱ
నున్నవారిద్దఱును గూడి యుచితవిద్య
లభ్యసించుచు నిజగురు నానతిం జ
రింపుచుండిరి మిక్కిలి పెంపుతోడ.

48


రాఘవ.

రాముఁడును లక్ష్మణుండును = రామలక్ష్మణు లిరువురును, ఉన్నవారిద్దఱును = మిగిలిన భరతశత్రుఘ్ను లిద్దఱును, గారాము మీఱన్, కూడి = జతలు గూడి, ఉచితవిద్యలు = వేదము ధనుర్విద్య మొదలైనవిద్యలను, నిజగురునానతిన్ = తమయొజ్జలు చెప్పునట్టు, అధ్యసించుచు = నేర్చుచు, మిక్కిలి పెంపుతోడ, నుండిరి.


లక్ష్మణ.

రాముఁడును = నాల్గవకుమారుఁడును, లక్ష్మణుండు = మూఁడవకుమారుఁడును, ఉన్నవారిద్దఱును = తిరుపతి, రామకృష్ణులును, గారాము మీఱ, కూడి = కలసి, ఉచితవిద్యల = తగినవిద్యలను, నిజగురునానతిన్ = తమయుపాధ్యాయులు చెప్పినరీతిని, అభ్యసించుచు, చరింపుచుండిరి.


తా.

గోపమంత్రి నలువురుపుత్రులును గూడి సకలవిద్యలు నేర్చుకొనుచుండిరి.