ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

47


గీ.

అన్న గారిభోగోన్నతి వన్నెమీఱు
చుండ రెండవయాతఁ దక్కొండిక లిరు
వురును భక్తియు భయము గదురఁగఁ జేరి
కొలుచుచుండ గభీరతఁ బొలుచుచుండు.

42


కులకము, నాల్గు పద్యములు.


రాఘవ.

ఆ+నగారిభోగోన్నతి - ఆ, నగారి = ఇంద్రునియొక్క, భోగోన్నతి = భోగాతిశయమువంటి భోగాతిశయము, వన్నెమీఱుచుండన్, రెండవయాతఁడు = భరతుఁడును, అక్కొండిక లిరువురున్ = ఆతమ్ములిద్దఱును (లక్ష్మణశత్రుఘ్నులు), భక్తియు, భయము, కదురఁగన్, చేరి, కొలుచుచుండన్, గభీరతన్ = గాంభీర్యముచే, పొలుచుచుండు.


తా.

రాముఁడు, ఇంద్రభోగము లనుభవించుచు భరతలక్ష్మణశత్రుఘ్నులు తన్నుఁ బరివేష్టింప నుండును.


లక్ష్మణ.

అన్నగారి = తిరుపతియొక్క, భోగోన్నతి = భోగాతిశయము, వన్నెమీఱుచుండన్, రెండవయాతండు = రామకృష్ణుఁడు, కొండిక లిరువురును = చిన్నవాండ్రైన లక్ష్మణరాములు, కొల్చుచుండన్, గభీరతఁ బొలుచుచుండును.


తా.

అన్నగారైన తిరుపతిని తక్కినమువ్వురును గొలుచుచుండిరి.


క.

తన కందమ్ములు నెఱయఁగఁ
గనుఁగొన సిరులీనునట్లు గ్రాలుచునుండుం
బెనుపొంద లక్ష్మణాఖ్యుఁడు
ఘనమతి జోడగుచు నుండఁగా నిత్యంబున్.

43


రాఘవ.

తనకున్ = రామునకు, అందమ్ములు నెఱయఁగన్ = చెలువములు విస్తరించునట్లు, గనుఁగొన = కంటితుద, సిరులీనునట్లు = సంపద లిచ్చునట్లుగ, క్రాలుచునుండున్, పెనుపొందన్, లక్ష్మణాఖ్యుఁడు = లక్ష్మణుఁడను, ఘనమతి = బుద్ధిమంతుఁడు, తోడగుచునుండన్ = జతకాఁగా, నిత్యంబున్ = ప్రతిదినమును.


తా.

రామునకు లక్ష్మణుఁడు జతయయ్యెను.