ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

లంకావిజయము


నొప్పెనయ లీల లభివృద్ధి నొంద నెసఁగు
నాయనఘనయశోభానియతు లెదుగఁగ.

34


రాఘవ.

పురుషోత్తమ = విష్ణుమూర్తివైన శ్రీరామా! కన్నమ్మ = కన్నతల్లియైన, కోసలక్ష్మావరసుత = కౌసల్య, ప్రీతిన్, నిలన్ = నిలుచుకొఱకు, కలిగి తనుచు=పుట్టితి వనియు, సుశ్రీ = మంచిశోభగలభరతుఁడా! భయదారివి - భయ = భయమును, ద = ఖండించు, అరివి = విష్ణుచక్రమైన, ఈవు = నీవు, గోపాలజుండౌట = దశరథపుత్రుఁడవౌటచే, కైక = కైకయొక్క, వాంఛ = కోరిక, రాజిలె నటంచున్ = ప్రకాశించె ననియును, భోగీంద్రున్ = ఆదిశేషుఁడవైన (లక్ష్మణుడు), నిన్ను, నేఁడు, ఈగతిన్ (పుత్రుగా), కనుట, సుమిత్ర = సుమిత్రదేవియొక్క, మోదస్థితి = సంతోషము, మించెన్ = ఎక్కుడయ్యె, ననుచున్, పితృ.. న్నతిన్ - పితృ = తలిదండ్రుల, సుకృత = పూర్వపుణ్యముయొక్క, ఉన్నతిన్ = అతిశయముచే, వలమురి = విష్ణుశంఖము, పురుషాకృతి = పురుషరూపముచేత, హారివి = మనోహరుఁడవైన, ఈవు = శత్రుఘ్నుఁడ వైననీవు, నలిని = అత్యంతము, యోగులు = తపస్వులును, బుధులు = దేవతలును, ఎన్నఁగ = మెచ్చఁగా, నలుగురు = ఆనలుగురుకుమారులు, రూపమున మీఱిరి = చక్కఁదనము గలవారైరి. అమలసద్రుచిబలమునన్ = స్వచ్ఛమైన దొడ్డతేజస్సుయొక్క సామర్థ్యమున, ఒ ప్పెనయన్ = సొగసు హత్తునట్లు, లీల లభివృద్ధి నొందన్ = విలాసము లభివృద్ధి నందునట్లు, ఎసఁగు = ప్రకాళించెడు, ఆ, యనఘ = నిర్దోషమైన, నయ = నీతి, శోభ = శోభలయొక్క, నియతులు = నియమములు, ఎదుగఁగ = వృద్ది పొందుకొఱకు, అని వెనుక కన్వయము.


తా.

కౌసల్య సంతోషమునకై, ఓ రామా! విష్ణుమూర్తివి నీ విట్లు పుట్టితివని, కైకవాంఛ తీర విష్ణుచక్రమవైనభరతుఁడా! నీవు పుట్టితివని, సుమిత్ర సంతోషించున ట్లాదిశేషుఁడా! నీవు లక్ష్మణుఁడవై పుట్టితివని, తండ్రి చేసినపుణ్యవశమున విష్ణుశంఖాంశమున శత్రుఘ్నా! నీవు జన్మించితి వని మునీంద్రులు మున్నగువారు స్తుతింప, రూపమున బలమున నసమానులై నల్వురుకొమరు లెదిగిరి.