ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

29


గురుపూజ మొదలుకొని, కృత్యము = చేయఁదగినదానిని, అంతయు, నడపెన్ = జరగించెను.


తా.

ఋష్యశృంగుఁడు చెప్పినట్లు శుభముహూర్తమున మంగళస్నానము చేసి భార్యలతోఁ గూడి దానికిఁదగినవిధానము నడపెను.


లక్ష్మణ.

తదనుమతిన్ = ఆపురోహితునియిష్టము చొప్పున, శుచిగురుసపర్య మున్నుగాన్ - శుచి = అగ్నిహోత్రుని, గురు = గురుని, సపర్య = పూజ, మున్నుగా = ముందుగా, తక్కినది సామాన్యముగానున్నది.


తా.

ఒక్క సుముహూర్తమునఁ బురోహితుఁడు చెప్పినట్లు భార్యతోఁ గూడ స్నానము చేసి యగ్నికార్యాదు లొనర్చెను.


వ.

తదనంతరంబ.

17


సీ.

శాంతాంచితద్విజసన్మనూజ్జ్వలఘనా,
        ధ్వరచితగతివిభావసుఁడు వెలుఁగ
నప్పుడు తన్మధ్యమందుండి దివ్యభూ,
        షణభూషితుఁడు సులక్షణయుతుండు
నగుచు నొప్పారు కృష్ణాభిఖ్యుఁ డగుదివ్య,
        పురుషుఁడు దృష్టిగోచరత నొంద
నంత నాగోపాలుఁ డతిభక్తిఁ గేల్మోడ్చు
        చున్నవరవిభాప్రసన్నమూర్తి


ఆ.

భవ్యపరమభక్తపాత్రికాలసదరు
శ్రీకరస్థితశుభకృద్గతియను
గుణమహిమయుతుండు గురుబుద్ధి యాతఁడు
హితతఁ జేరి పేర నతనిఁ బిలిచె.

18


రాఘవ.

శాంతాం.......గతి - శాంతాంచితద్విజ = శాంతాదేవితో నొప్పుచుండినఋష్యశృంగునియొక్క, సన్మనూజ్జ్వల = సన్మంత్రములచేఁ బ్రకాశిం