ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

లంకావిజయము


వంశశుక్తిన్ - వితత = ప్రసిద్ధమైన, కీర్తి = కీర్తియను నింటిపేరుగల, వంశ = కులమనెడు, శుక్తి = ము తైపుఁజిప్పను, ముక్తామణివరుసన్ = ముత్తెముభంగిని, శోభఁగ్రాలు = శోభ యతిశయించిన, వారిము . .. వేణికన్ - వారిముక్ = మేమములయొక్కయు, ఉరగ = సర్పములయొక్కయు, ఆళికా = పఙ్క్తితో, సమాన = సమానమైన, వేణిక = జడగల దానిని, సమదం బొప్పఁ బెండ్లియాడెన్ = సంతోషపూర్వకముగ వివాహము చేసికొనియెను.


తా.

గోపాలమంత్రి కీర్తియనునింటిపేరుగలవారి వంశమాణిక్యమయిన రాజమ్మయను సుందరాంగిని వివాహము చేసికొనియెను.


వ.

మఱియు.

9


అర్థము రెంటికి సమానము.


సీ.

సరసరామాజనవరకోసలేశజ,
        యాత్మహర్షముగ మాటాడు మనును
గైక రమ్మా నను గదియించి మది నాత్మ
        భూలీలఁ బ్రోవు మం చోలిఁ బల్కు
స్తోత్రార్హభావ సుమిత్రాబ్జనయన న,
        న్నాదరించు మటంచు నాశ్రయించు
నట్లు రహస్యంబునం దాత్మదేవుల
        నిష్టార్థసిద్ధికై యెపుడు వేఁడు


గీ.

ననఘుఁ డతఁ డజసంతతిఘనుఁడు ధైర్య
మునను గాంభీర్యమున నీతి భూతిఁ గీర్తి
మూర్తి మానమునను దానమున ద్యుతి మతి
శాంతి దాంతి నరయ నెందు సవతు లేక.

10


రాఘవ.

సరస . . . లేశజ - సరస = రసికురాండ్రయిన, రామాజన = స్త్రీలలో, వర = శ్రేష్ఠురాలవైన, కోసలేశజ = కోసలరాజపుత్త్రీ! ఆత్మహర్ష ముగ = మన