పుట:KutunbaniyantranaPaddathulu.djvu/88

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 88

తుంది. దానికి కారణం సంయోగంలో పాల్గొంటూ ఉండడం వలన యోని మార్గం వదులుగా అవుతూ ఉండడమే. దాంపత్య జీవితపు తొలిదినాల్లో ఇలా మార్చవలసి ఉండగా మరికొన్ని సందర్భాలలో కూడా డయాఫ్రం సైజులను మార్చవలసి వస్తుంది. ముఖ్యంగా కాన్పు అయిన తరువాత గర్భిణీలు పోయినప్పుడూ, ఆపరేషన్ అయినప్పుడూ, అంతే కాకుండా ఏ స్త్రీ అయినా పది పౌన్ల బరువు పెరిగినా, తరిగినా డయాఫ్రం మార్చవలసి వస్తుంది.

ఒక స్త్రీకి సరయిన డయాఫ్రం నిర్ణయించడానికి ముందుగా యోని లోపల గర్భాశయ కంఠం, బస్థి ఎముకల స్థితి ఎలా ఉన్నదీ డాక్టరు పూర్తిగా పరీక్ష చేయడమే కాకుండా ఆ స్త్రీకి కూడా తనంతటకి తాను గర్భాశయ కంఠాన్ని దానికి ముందు ఉండే బస్థి యెముకని చక్కగా

డయాఫ్రం పట్టుకుని యోనిలో ప్రవేశ పెట్టుకునే విధానం