పుట:KutunbaniyantranaPaddathulu.djvu/85

ఈ పుట ఆమోదించబడ్డది

సంతాన నిరోధానికి వాడే డయాఫ్రంలు ముఖ్యంగా నాలుగు రకాలు: 1. వెజైనల్ డయాఫ్రం, 2. వాల్ట్ కాప్, 3. సెర్వయికల్ కాప్, 4. వెములె కాప్.

డయాఫ్రంలు రబ్బరుతో గాని, ప్లాస్టిక్‌తో గాని తయారు చేయబడతాయి.

వెజైనల్ డయాఫ్రంలు, వీటినే డచ్‌కాప్‌లు అంటారు. రబ్బరుతో తయారు చేయబడతాయి. ఇవి వివిధ సైజుల్లో లభ్యమవుతాయి. 50 మిల్లీమీటర్ల నుంచి 100 మిల్లీమీటర్లు నిడివి ఉండేవి లభ్యమవుతాయి. పిల్లలు కలగని స్త్రీలకి 65-70 మిల్లీమీటర్ల సైజు కల డయాఫ్రలు కావాలి. పిల్లలు పుట్టిన స్త్రీలకి 75-80 మిల్లీమీటర్లు సైజువి కావాలి. ఈ డయాఫ్రంలు ఎవరికి తగిన సైజుల్లో వారు ఎన్నుకొని యోని లోపల సింఫసిస్ ప్యూబిస్ దగ్గర ముందు ఫిక్స్ చేసి తరువాత యోనికి వెనక భాగంలో బిగుతుగా పట్టుకొని ఉండే విధంగా అమర్చాలి. ఇలా అమర్చగా దానిలో గర్భాశయ కంఠం మూసివేయబడుతుంది.

డయాఫ్రంని యోని లోపల పెట్టుకోవడం ఎలాగో ఒకసారి తెలుసుకుంటే తరువాత నుంచి తేలికగా పెట్టుకోవచ్చు. కాని ఎందుకనో మనదేశంలో డయాఫ్రంలు వాడే స్త్రీలు చాలా తక్కువ. 1981-82 సంవత్సరములో మనదేశంల్లో కేవలం 1065 డయాఫ్రంలు వాడబడ్డాయి.