పుట:KutunbaniyantranaPaddathulu.djvu/55

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 55

లూప్ ఎప్పుడు పడితే అప్పుడు వేయకూడదు. నేల మధ్యలో వేసినట్లయితే గర్భం ఉండవచ్చు. అటువంటప్పుడు లూప్ వేయడంవల్ల ఫలితం ఉండదు. లేదా లూప్ వేయడం వల్ల గర్భస్రావం జరగవచ్చు. దాంపత్య సంబందాలలో అసలు పాల్గొనకుండా ఉంటే బహిష్టుకీ మధ్య కాలంలో ఎప్పుడైనా లూప్ వేయవచ్చు.

కొందరికి మామూలు దినాల్లో గర్భాశయ కంఠద్వారం (సెర్వయికల్ కెనాల్) బిగుతుగా ఉండి లూప్ వేయడానికి అప్లి కేటర్ దూరదు. అదే స్త్రీ బహిష్టు ఉన్న సమయంలో అయితే సెర్వయికల్ కెనాల్ వదులుగా ఉంటుంది. దానితో అప్లికేటరు తేలికగా గర్భాశయంలోకి ప్రవేశిస్తుంది. అందువలన సుళువుగా లూప్ వేయడానికి, లూప్ వేయించుకునే స్త్రీకి బాధ లేకుండా ఉండటానికి లూప్‌ని బహిష్టు ఉన్న సమయంలో వేయడం మంచిది. బహిష్టు సమయంలో లూప్ వేయడం వల్ల అది జారిపోవడం జరగదు.

కాన్పు అయిన తరువాత లూప్

కాన్పు అయిన తరువాత ఆరు వారాలకి లూప్ వేయవచ్చు. మరీ అవసరం అనుకుంటే కాన్పు అవగానే ఆ స్త్రీ డెలివరీ టేబుల్ నుంచి దిగకుండానే లూప్ వేయవచ్చు లేదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతున్నప్పుడు వేసి పంపవచ్చు. గర్భస్రావం జరిగిన తరువాత లూప్ వెంటనే