పుట:KutunbaniyantranaPaddathulu.djvu/53

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 53

అగ్రభాగాన వంకర తిరిగి ఉండే రెండు ప్లాస్టిక్ కొమ్ములు ఉంటాయి.

ఈ లూప్‌కి క్రిందిభాగంలో రెండు నైలాన్ దారాలు ముడివేయబడి ఉంటాయి. మల్టీలోడ్ సి యు 250 లూప్‌కి సంబంధించి ప్లాస్టిక్ రాడ్ కి 27 సెంటీమీటర్ల రాగి వైరు చుట్టబడి ఉంటుంది. ఈ రాగి వైరు మొత్తం 250 స్క్వేర్ మిల్లీ మీటర్ల వైశాల్యాన్ని ఆక్రమించి ఉంటుంది. కాపర్ (రాగి) 250 స్క్వేర్ మిల్లీ మీటర్లు వైశాల్యం ఆక్రమించి ఉంటుంది కనుక ఈ లూప్‌ని 'మల్టీలోడ్ సి యు 250 ' అంటారు. 'సి యు ' అంటే కాపర్ (రాగి).

'మల్టీలోడ్ సి.యు 250 'లూప్ స్టెరలైజ్డ్ ప్యాక్‌లో లభ్యమవుతుంది. అందుకని దీనిని గర్భకోశంలో ప్రవేశపెట్టే ముందు ప్రత్యేకంగా శుభ్రపరచవలసిన అవసరం లేదు. ఈ లూప్‌తోనె అప్లి కేటర్ కూడా ఇవ్వబడుతుంది. అది కూడా శుబ్రప్రరిచే ఉంటుంది. తక్కిన లూప్‌ల్లాగానే ఈ లూప్ కూడా గర్భకోశంలోకి ప్రవేశ పెట్టడం జరుగుతుంది.

లూప్‌ని తీసివేయడం ఎలా ?

కాపర్ -టి లూప్‌నిగాని, మల్టీలోడ్ సి.యు 250 లూప్‌ని గాని తీసివేయాలనుకున్నప్పుడు గర్భాశయ కంఠం నుండి యోనిలోకి వ్రేలాడుతూ కనపడే నైలాన్ దారాలని