పుట:KutunbaniyantranaPaddathulu.djvu/41

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 41

నాలంటే మరొక బిళ్లని యోనిలోకి ప్రవేశపెట్టాలి. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి. యోనిలోకి బిళ్ళని ప్రవేశపెట్టుకున్న తరువాత 10 నిమిషాల వరకు రతిలో పాల్గొనకుండా ఆగాలి. యోనిలోకి ప్రవేశపెట్టుకునే ఈ బిళ్ళలవల్ల యోనిలో మంటగాని మరో బాధగాని వుండదు. బిళ్ళ వెంటనే కరిగి పోతుంది కనుక రతికి ఎటువంటి ఆటంకం వుండదు. స్త్రీకిగాని, పురుషునికి గాని ఎటువంటి అనారోగ్యం కలగదు. ఈ బిళ్ళలు ఎంతకాలం ఉపఉయోగించినా నష్టం కలగదు. ఏ వయస్సుకి చెందిన స్త్రీలైనా ఉపయోగించవచ్చు. అయితే ఆ బిళ్ళ పనిచేసేది గంటసేపే అనేది గుర్తు వుంచుకోవాలి. ఒకవేళ ఒకేరోజున మూడు నాలుగుసార్లు రతిలో పాల్గొంటే అన్నిసార్లూ ఒక్కొక్క భిళ్ళని యోనిలో పెట్టుకోవాలి. ఇది మెంగే బిళ్ళ కాదు కనుక కడుపులో వికారం వంటి బాధలు వుండవు.

                                               * * *