పుట:KutunbaniyantranaPaddathulu.djvu/30

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 30

అసలు రాత్రిపూట భోజనము చేయగానే యీ మాత్ర వేసుకుంటే చాలావరకూ ఏ వికారము అనిపించదు లేదా ఒక గ్లాసు పాలలో తీసుకున్నా ఏమీ అనిపించదు.

ఈ మాత్రలు తీసుకొంటున్న కొందరు స్త్రీలల్లో కాళ్ళకి నీరు రావడం, కాళ్ళల్లో కండలు బిగదీసుకున్నట్లు, వక్షోజాలు బరువెక్కినట్లు, ఒళ్ళు బరువెక్కినట్లు అవడము ఉంటాయి. కొందరికి ఒంటికి దురదలు వస్తాయి. ఇలాకాక కొందరు స్త్రీలకు బాగా తలనొప్పి రావడము, ఒళ్ళు తూలినట్లు అవడము, చూపు కనబడటమ లో మార్పు రావడము కలుగవచ్చు. ఇటువంటప్పుడు ఆ మాత్రలు ఆపివేయడము మంచిది. కొందరు స్త్రీలకు తెల్లబట్ట అవడము అనేది ఈస్ట్రోజన్ వల్ల నే కాని ఇతరత్రా వ్యాధి కలిగిగాదు. కొందరు స్త్రీలల్లో ఆకలిపెరగడము, బరువు పెరగడముకూడా వుంటాయి. మరికొందరు స్త్రీలల్లో యీ మాత్రలు వాడుతున్నా బహిష్టుకీ బహిష్టుకీ మధ్య కొద్దిగా రక్తస్రావం కనబడవచ్చు. అది కేవలము ఆ మాత్రలలో ప్రొజష్టిరోన్ హార్మోనుకి సంబంధించిన మోతారు తక్కువలో ఉండుటయే కారణము. ఇటువంటి స్త్రీలు ప్రొజిస్ఠిరోన్ ఎక్కువ ఉండే గర్భనిరోధక మాత్రలు వాడడము మంచిది. అరుదుగా కొందరికి యోనిలో బాగా దురద, మంట కలగడము సంయోగానికి ఇబ్బందికరంగా వుండటము ఉండవచ్చు. అది కేవలం యీ మాత్రల వల్లనే