పుట:KutunbaniyantranaPaddathulu.djvu/29

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 29

మానివేసిన 2 నెలల్లో గర్భిణీ రావడానికి ఆస్కారము వుంది 90 శాతం స్త్రీలు ఒక సంవత్సర కాలము లోగా గర్భవత్రులవుతారు. స్త్రీలు గర్భనిరోధక మాత్రలు వాడినా, అవి మానివేసిన తరువాత అందరి స్త్రీలలాగానే మామూలుగా గర్భవతులవుతారు. అలాగే గర్భనిరోధక మాత్రలు వాడి ఆపిన తరువాత ఆ స్త్రీలకు పుట్టిన పిల్లలు మామూలు ఆరొగ్యవంతులుగానే వుంటారు. వారిమీద ఆ మాత్రల ప్రభావము ఏమీ వుండదు.

గర్భనిరొధక మాత్రలు - దుష్పలితాలు

మామూలు ఆరోగ్యవంతమైన స్త్రీకి ఈ మాత్రలవల్ల పెద్ద దుష్ఫలితాలు ఏమీ కలగవు. కాని మాత్రలు వాడడము మొదలు పెట్టిన మొదటి రెండు మూడునలల్లో కొన్ని ఒడిదుడుకులు కనపడతాయి. దీనికి కారణము ఆ మాత్రలో వుండే ఈస్ట్రోజన్ హార్మోను. నాలుగు నెలల్లోగా మాత్రల రూపములో యిచ్చే ఈ హార్మోనుల ప్రభావానికి శరీరము సరిపెట్టు కోగలుగుతుంది. 3 నెలల తరువాత కూడా యీ మాత్రలవల్ల చెడు ఫలితాలు కనబడుతూ వుంటే డాక్టరు సలహా పొందడము మంచిది. ఎక్కువమంది స్త్రీలల్లో వీటివల్ల ఎటువంటి చెడు ఫలితాలు కనబడవు మామూలుగా ఇబ్బంది కలిగించే లక్షనాలల్లో కడుపులో వికారము ఒకటి మామూలుగా ఒకటి రెండు రోజులలో యీ ఇబ్బంది తగ్గిపోతుంది.