పుట:KutunbaniyantranaPaddathulu.djvu/25

ఈ పుట ఆమోదించబడ్డది

స్త్రీకి అయినా పిల్లలు కలిగే విషయంలో అదుపు చేసుకోగల శక్తీ, స్వేచ్ఛ లేనంతకాలము స్వతంత్రముగల స్త్రీగా మనజాలదు. ఈ అభిప్రాయముతోనే 1930 లో మార్గరేట్ శానజర్ "ప్లాన్డ్ పేరెంటు హుడ్ ఫెడరేషన్" నుండి 2,100 డాలర్లు విరాళంగా సేకరించి డాక్టర్ పింకన్ అతని సహచరుడు జాన్ రాక్‌కి గర్భనిరోధక ప్రక్రియలు కనిపెట్టడానికి సహాయము చేసింది. తరువాత వీరిద్దరి రీసెర్చికి అనేక సంస్థల నుంచి కూడా కొన్ని మిలియన్ల డాలర్లు రాసాగాయి. 1956 లో రాక్ పింకన్ - వీరితో కలసిన మరొక డాక్టర్ సెల్సొగార్సియా మురికి పేటల్లో నివసించే 265 మంది స్త్రీల మీద ఈ గర్భనిరోధక మాత్రలు వాడి సంతృప్తికరమైన ఫలితాలను గమనించాడు. దీనితో "ఉమన్ లిబరేషన్" ఉద్యమములో విప్ల వాత్మకమైన మలుపు వచ్చింది. గర్భనిరోధక మాత్ర కనిపెట్టిన దశాబ్దంలోనే అనేక కంపెనీలు యీ మాత్రలను కొన్ని మిలియన్ల సంఖ్యలో తయారు చేశాయి.

గర్భనిరోధకమాత్ర ఎలాగర్భాన్ని నిరోధిస్తుంది?

మామూలుగా మెదడులో ఉండే పిట్యూటరీ గ్రంధినుండి అండాశయాలని ఉత్తేజపరిచే హార్మోన్లుతయారవుతూ వుంటాయి. ఆ పిట్యూటరీ హార్మోన్ల ఫలితంగా అండాశయాలనుండి గ్రుడ్డు తయారయి విడుదలవడం జరుగుతూ