పుట:KutunbaniyantranaPaddathulu.djvu/209

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 209

టేనూ, వారికి వయస్సు 18 సంవత్సారాలకంటే తక్కువ వుంటేనూ, ఒక స్త్రీకి 45 ఏళ్ళు దాటి ఇక పిల్లలు అనవసరమను కుంటేనూ గర్భస్రావము చేయడానికి చట్టంలో అనుమతి పొందుపరచి వున్నది. కాని ఇలాంటి కారణాలు మనదేశంలో ఒప్పుకొనక “మానసిక వేదన“ అన్న దాంట్లో డాక్టరు నిర్ణయానికి వదలడమైనది.

గర్భస్రావం ఎన్ని నెలల వరకు చేయవచ్చు!

చట్టం ప్రకారము గర్భస్రావము చేయడానికి ఇంగ్లీషు వైద్యం చేసే డాక్టర్లు మాత్రమే అర్హులు. హోమియోపతి, ఆయుర్వేద, యునాని మొదలైన వైద్యులు అర్హులు కారు. అదేవిధంగా ఆర్.యం.పి. పి.యం.పి లకి గర్బస్రావం చేయడానికి అర్హతలేదు. అల్లోపతి డాక్టర్లు గర్భస్రావం చేయడానికి రాష్ట్ర వైద్యమండలి నుండి ప్రత్యేకంగా అనుమతిపొంది తమ పేరు రిజిష్టరు చేయించుకోవాలి.


మూడు నెలలలోపు కడుపు వున్న వాళ్ళకి గర్భస్రావము చేయడానికి డాక్టరు తనంతట తాను నిర్ణయం తీసికొని గర్భస్రావం చేయవచ్చు. కాని మూడు నెలలకి పైబడి అయుదునెలలలోపు కడుపువున్నప్పుడు గర్భస్రావము చేయ-